
చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి
● రాష్ట్ర ఎకై ్సజ్ కమిషనర్ నిశాంత్ కుమార్
ఒంగోలు టౌన్: చట్టాలపై సమగ్రంగా అవగాహన పెంపొందించుకోవాలని, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ చెప్పారు. డైరక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ రాహుల్ దేవ్ శర్మతో కలిసి బుధవారం ఒంగోలు పోలీసు ట్రైనింగ్ కాలేజీని సందర్శించారు. కాలేజీలో శిక్షణ పొందుతున్న 102 మంది ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సబ్ ఇన్‌స్పెక్టర్లతో మాట్లాడారు. శిక్షణ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎకై ్సజ్ యాక్ట్, ఎన్‌డీపీఎస్ యాక్ట్‌ల ప్రకారం నిందితులను అరెస్టు చేయడం, కేసు నమోదు చేయడం వంటి విషయాలను వివరించారు. మహిళలను అరెస్టు చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను వివరించారు. చెక్ పోస్టు నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. నిత్యం చట్టాల గురించి అధ్యయనం చేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు, అసిస్టెంట్ కమిషనర్ దయాసాగర్, జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ షేక్ ఆయేషా బేగం, ఏఈఎస్‌లు, సీఐ, ఎస్సైలు, పీటీసీ అధికారులు పాల్గొన్నారు.