Sakshi News home page

ప్రధాని మోదీ చేస్తున్నది దేశానికి మంచిది కాదు: అరవింద్ కేజ్రీవాల్

Published Mon, Apr 1 2024 2:41 PM

What PM Modi is Doing Not Good for Country Says Arvind Kejriwal - Sakshi

ఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీ సోమవారం (ఏప్రిల్ 1) ముగియడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు కేజ్రీవాల్‌ను ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. 

'ప్రధానమంత్రి (నరేంద్ర మోదీ) చేస్తున్నది దేశానికి మంచిది కాదు' అని అరవింద్ కేజ్రీవాల్‌ను రూస్ అవెన్యూ కోర్టుకు తీసుకువస్తున్నప్పుడు వెల్లడించారు. కోర్టులో ఆప్ సభ్యులు అతిషి, సౌరభ్ భరద్వాజ్, కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్‌లు హాజరయ్యారు.

మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తరువాత రోజు న్యాయమూర్తి బవేజా అతన్ని మార్చి 28 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి అప్పగించారు. మళ్ళీ కేజ్రీవాల్‌ ఇంటరాగేషన్‌ను ఏప్రిల్ 1 వరకు నాలుగు రోజుల పాటు పొడిగించాలని కోరుతూ ఈడి చేసిన విజ్ఞప్తిని కోర్టు అనుమతించింది.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్టుకు వ్యతిరేకంగా.. ఆయనకు సంఘీభావం తెలిపే ర్యాలీలో, ఇండియా కూటమి నాయకులు ఆదివారం రాంలీలా మైదాన్‌లో సమావేశమయ్యారు. ఇందులో బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇతర నాయకులు ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement