
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్
తెలంగాణలో అవినీతి పాలన కొనసాగుతోందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, టీఆర్‌ఎస్ మెడల్ వంచే పార్టీ బీజేపీ అన్నారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అవినీతి పాలన కొనసాగుతోందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, టీఆర్‌ఎస్ మెడల్ వంచే పార్టీ బీజేపీ అన్నారు. పీఎంఏవై పథకాన్ని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లుగా మార్చారని దుయ్యబట్టారు. పేదల గురించి ఆలోచించే పరిస్థితిలో టీఆర్‌ఎస్ సర్కార్ లేదని మండిపడ్డారు.
టీఆర్‌ఎస్, ఎంఐఎం రెండూ ఒక్కటేనంటూ ధ్వజమెత్తారు. ఉప ఎన్నిక వస్తేనే కేసీఆర్ బయటకు వస్తారని ఆయన ఎద్దేవా చేశారు. తన పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకునే అవకాశం లభించిందని.. ఎక్కడికి వెళ్లినా ప్రజలు తమ సమస్యలనే చెప్పుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు.
ఇవీ చదవండి:
సమాజం తలదించుకునే ఘటన: మహిళను వివస్త్ర చేసి కారం చల్లి
సెల్‌ఫోన్ టవర్లు, కేబుళ్లు కనుమరుగు కానున్నాయా..!