‘గ్రేటర్‌లో బీజేపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు’ | Nobody Stop BJP Victory In GHMC Elections, Indrasena Reddy | Sakshi
Sakshi News home page

‘గ్రేటర్‌లో బీజేపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు’

Nov 17 2020 1:35 PM | Updated on Nov 19 2020 10:34 AM

Nobody Stop BJP Victory In GHMC Elections, Indrasena Reddy - Sakshi

హైదరాబాద్‌:   గ్రేటర్‌ హైదరాబాద్‌లో బీజేపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని ఆ పార్టీ సీనియర్‌ నేత నల్లు ఇంద్రసేనా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తగిలిన గట్టి దెబ్బ కంటే పెద్ద దెబ్బ కొట్టడానికి గ్రేటర్‌ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. విద్యావంతలు, ప్రయివేటు ఉద్యోగులు టీఆర్‌ఎస్‌పై ఆగ్రహంతో ఉన్నారని ఇంద్రాసేన రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈరోజు జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన నేపథ్యంలో ఇంద్రసేనా రెడ్డి మీడియాతో మాట్లాడారు.

‘గ్రేటర్‌లో బీజేపీ విజయం ఖాయం. ఎన్నికల హామీలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విస్మరించింది. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పేర్ల చెప్పి గత ఎన్నికల్లో ఓట్లు దండుకున్నారు. హైదరాబాద్‌లో ఎన్నికలు జరుగునున్న డిసెంబర్‌1వ తేదీన హాలీడే ప్రకటించాలి. పోలింగ్‌ బూత్‌ వారిగా ఓటరు జాబితా ఇవ్వలేదు.  రాష్ట్ర ఎన్నికల సంఘం అధికార పార్టీగా తొత్తుగా వ్యవహరిస్తోంది’ అని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement