కోల్‌సిటీ: మత్తు పదార్థాల అక్రమ రవాణా, నిల్వలు, వినియోగాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో యాంటీ నార్కోటిక్స్ వింగ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. రామగుండం బల్దియా కార్యాలయం, పార్కింగ్ ప్రాంతంలో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సహకారంతో తనిఖీలు చేపట్టారు. వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సైలు అఫ్జాలోద్దీన్, మనోహర్ ఆధ్వర్యంలో సందర్శకుల సామగ్రి, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మత్తు పదార్థాల అక్రమ కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


