శ్లోకాల పఠనంలో ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

శ్లోకాల పఠనంలో ప్రతిభ

Apr 12 2026 2:36 AM | Updated on Apr 12 2026 2:36 AM

కాల్వశ్రీరాంపూర్‌: గణపతి సచ్చితానంద మైసూర్‌ దత్త పీఠం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్టా ల్లో ఇటీవల నిర్వహించిన భగవత్‌ గీత ఆన్‌లైన్‌ శ్లో కాల పోటీల్లో కోలేటి రమాదేవి గోల్డ్‌ మెడల్‌ సాధించారు. 700 శ్లోకాలు కంఠస్థం చేసిన రమాదేవి అలవోకగా ఆన్‌లైన్‌లో పఠించి పురస్కారానికి ఎంపికయ్యారు. శ్రీలలితా పారాయణం గ్రూపు మహిళలు, ఆర్యవైశ్య సంఘం నాయకులు కోలేటి రమాదేవి–రామయ్య దంపతులను శనివారం మండల కేంద్రంలో శాలువాలు కప్పి సన్మానించారు. ఈకార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు రాఘవులు, అశోక్‌, మహిళా సంఘం అధ్యక్షురాలు జ్యోతి, లలితా పారాయణం గ్రూపు మహి ళలు, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement