ధర్మారం: కటికెనపల్లి బీఆర్‌ఎస్ పార్టీ నాయ కులు, గ్రామ పంచాయితీ వార్డు సభ్యులు ఇద్ద రు తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సర్పంచ్ చేపూరి లచ్చయ్య ఆధ్వర్యంలో శనివారం ధర్మపురిలోని మంత్రి క్యాంపు కా ర్యాయలంలో మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ను వార్డు సభ్యులు అనపురం వెంకటేశ్, మల్లెత్తుల రవి, వారి అనుచరులు కాంగ్రెస్‌లో చేరారు. మంత్రి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉపసర్పంచ్ బోనగిరి అజయ్, మా జీ ఉపసర్పంచ్ గంగారెడ్డి పాల్గొన్నారు.
నేడు పెద్దపల్లికి కేటీఆర్
పెద్దపల్లి: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ ఆర్ ఆదివారం జిల్లా కేంద్రానికి వస్తారని మా జీఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రానికి వెళ్తూ మార్గమధ్యంలోని పెద్దపల్లిలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేస్తారన్నారు. అనంతరం కార్యకర్తలతో మాట్లాడతారని ఆయన పేర్కొన్నారు.
బస్టాండే టీకా కేంద్రం
కమాన్‌పూర్: స్థానిక బాపూజీనగర్‌లో చిన్నారులకు వ్యాక్సిన్ వేయడానికి అరోగ్య ఉప కేంద్రం లేదు. దీంతో వైద్యసిబ్బంది రోడ్డు పక్కన ఉన్న బస్టాండ్‌లో చిన్నారులకు టీకా వేశారు. అంగన్‌వాడీ కేంద్రం కూడా అందుబాటులోలేదు. దీంతో చిన్నారులకు వ్యాక్సిన్, ప్రజలకు వైద్యసేవలు అందించడానికి ఇబ్బంది పడుతున్నా మని వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు.
సివిల్స్ సాధించడమే లక్ష్యం
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో కేబుల్ ఆపరేటర్‌గా పనిచేసే లైసెట్టి భిక్షపతి – అనిత దంపతుల కుమారుడు లైసెట్టి అఖిల్‌కృష్ణ స్టాఫ్ సె లక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) నిర్వహించిన పరీక్ష లో ప్రతిభ కనబర్చి(390కు 333 మార్కులు) క స్టమ్స్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం సాధించారు. ప్రాథమిక విద్య పెద్దపల్లి, ఇంటర్ హైదరాబాద్, ఇంజినీరింగ్ చెన్సైలో పూర్తిచేసిన అఖిల్.. ప్రస్తు తం ఉస్మానియా యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు ఇ చ్చిన ప్రోత్సాహంతో తాను ముందుకు సాగానని, కోచింగ్‌కు వెళ్లకుండానే కష్టపడి చదివానని అన్నారు. సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని తెలిపారు. పలువురు అభినందించారు.
చెరువు అభివృద్ధికి నిధులు
పెద్దపల్లి: సుల్తానాబాద్‌లోని ఊరచెరువును మి నీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేసేందుకు ప్ర భుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో జీవో నంబర్ 170 ద్వారా రూ.8 కోట్ల 77 లక్షల 50 వేలు మంజూరు చేస్తూ సర్కారు శనివారం ఉత్తర్వు లు జారీచేసింది. నిధులు మంజూరు చేసిన సీ ఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రె డ్డి, శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్ విజయరమణారావు చిత్రపటాలకు నాయకులు క్షీరాభిషేకం చేశారు. మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్, వైస్ చైర్‌పర్సన్ అంతటి పుష్పలత, పట్టణ అధ్యక్షుడు వేగోళం అబ్బయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సమ్మర్ ఇంటర్న్‌షిప్
రామగుండం: అంతర్గాం మండలం లింగాపూ ర్ మోడల్ స్కూల్ ఒకేషనల్ విద్యార్థులు స మ్మర్ ఇంటర్న్‌షిప్ విజయవంతంగా పూర్తిచేశా రని ప్రిన్సిపాల్ పంబాల సదానందం తెలిపా రు. 10రోజులు ఇంటర్న్‌షిప్ జరిగిందన్నారు.


