మత్తు పదార్థాలతో ముప్పు | - | Sakshi
Sakshi News home page

మత్తు పదార్థాలతో ముప్పు

Apr 12 2026 2:36 AM | Updated on Apr 12 2026 2:36 AM

● యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి ● పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి సూచన ● గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో వ్యసన నివారణ కేంద్రం ప్రారంభం

కోల్‌సిటీ(రామగుండం): యువత మత్తుపదార్థాల కు దూరంగా ఉండాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి సూచించారు. 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గోదావరిఖని గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌(జీజీహెచ్‌)లో ఏర్పాటు చేసిన ‘అడిక్షన్‌ ట్రీట్‌మెంట్‌ ఫెసిలిటీ’ కేంద్రాన్ని గోదావరిఖని ఏసీపీ రమేశ్‌తో కలిసి డీసీపీ శనివారం ప్రారంభించారు. సిమ్స్‌ విద్యార్థులకు మ త్తు పదార్థాల వినియోగం, నష్టాలపై నిర్వహించిన ఆర్ట్స్‌, క్విజ్‌ పోటీల్లో విజేతలుగా నిలిచిన మెడికో లకు డీసీపీ సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మత్తు పదార్థాల వినియోగా న్ని అరికట్టడంతోపాటు వ్యసన బాధితులకు స మగ్ర వైద్య సేవలు అందించేందుకే జీజీహెచ్‌లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగం సమాజానికి ముప్పుగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశా రు. అలాంటి వ్యసనాల నుంచి బయటపడేందుకు ఇలాంటి చికిత్స కేంద్రాలు ఎంతో దోహదపడుతాయని పేర్కొన్నారు. ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్‌ అరుణ మాట్లాడుతూ, డ్రగ్‌ అడిక్షన్‌ కౌన్సెలింగ్‌ సెంటర్‌, సబ్‌స్టాన్స్‌ ఇంటాక్సికేషన్‌ కేర్‌ యూ నిట్‌తోపాటు ఔషధ చికిత్స, పునరావాస సేవలు ఇందులో అందుబాటులో ఉంటాయన్నారు. ఆర్‌ఎంవోలు కృపాభాయి, దండె రాజు, సైకియాట్రిస్ట్‌ రవివర్మ మాట్లాడుతూ, వ్యసనాలతో శారీరక, మా నసిక సమస్యలు తీవ్రంగా ప్రభావితం అవుతాయన్నారు. సమయానికి సరైన చికిత్స తీసుకుంటే బాధితులు పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని వన్‌టౌన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి, మెడికల్‌ విద్యార్థులు, నర్సింగ్‌ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement