● సాదాబైనామాలకు ఎట్టకేలకు మోక్షం ● అమ్మకందారు అఫిడవిట్‌ ఎత్తివేత ● జిల్లావ్యాప్తంగా 35,323 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

● సాదాబైనామాలకు ఎట్టకేలకు మోక్షం ● అమ్మకందారు అఫిడవిట్‌ ఎత్తివేత ● జిల్లావ్యాప్తంగా 35,323 అర్జీలు

Apr 11 2026 9:10 AM | Updated on Apr 11 2026 9:10 AM

● సాదాబైనామాలకు ఎట్టకేలకు మోక్షం ● అమ్మకందారు అఫిడవిట్‌ ఎత్తివేత ● జిల్లావ్యాప్తంగా 35,323 అర్జీలు

సాక్షి పెద్దపల్లి: తెల్లకాగితంపై ఒప్పందం చేసుకొ ని(సాదాబైనామా) భూములు కొనుగోలు చేసిన వారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రభు త్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. జిల్లాలో దాదాపు 70 నుంచి 90శాతం వరకు చిన్న, సన్నకారు రైతులు తాము సాగు చేస్తున్న భూములు త మవే అయినా వాటి స్వరూపం, క్రమబద్ధీకరణకాక నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ రాయితీలు, సంక్షేమ ఫలాలు, బ్యాంకు రుణాలు పొందలేకపోతున్నారు. రైతుబంధు సాయం, రైతుబీమా వర్తించడంలేదు. ధాన్యం కొనుగోలు సందర్భంలోనూ ఇబ్బందులు తప్పడంలేదు.

భూవివాదాలకు ప్రధాన కారణమిదే..

సుమారు నాలుగైదు దశాబ్దాల క్రితం వ్యవసాయ భూములు, ఇళ్లస్థలాల క్రయ, విక్రయాలు తెల్లకాగితాలపైనే జరిగాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు స్టాంపు పేపర్లపై ఒప్పందాలు రాసుకునేవారు. తమ పూర్వీ కులు ఇతరులకు భూముల విక్రయించినట్లు చిన్నకాగితం ఉన్నా వారి వారసులు ఆ భూముల జోలికి వెళ్లేవారు కారు. ఆ పరిస్థితులు ఇప్పుడు మారిపో యాయి. భూముల ధరలు పెరగడంతో రియల్‌ వ్యాపారం జోరందుకుంది. దీంతో రికార్డుల్లో తమ పేర్లు ఉన్నాయంటూ కొందరు వారసులు తిరగబడుతున్నారు. ఏళ్లతరబడి సాగు చేసుకుంటున్నామని, ఇప్పుడు వచ్చి ఆ భూములు తమవి అంటే ఎ లా అని బాధితులు లబోదిబోమంటున్నారు. ఇలా వివాదాలు ప్రారంభమవుతున్నాయి. అనేకమంది రైతులు నిత్యం ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

తాజా నిబంధనల ప్రకారం..

తాజా నిబంధనలో కొనుగోలుదారు ఒకరే అఫిడవిట్‌ సమర్పిస్తే సరిపోతుంది. ఆ తర్వాత అర్జీలోని వివరాల ప్రకారం.. దరఖాస్తుదారు మోఖాపై ఉ న్నారా? లేరా? అని తహసీల్దార్‌ విచారణ చేస్తారు. సర్కారు, అసైన్డ్‌, అటవీ, పట్టాభూమి, విస్తీర్ణం తదితర వివరాలను పరిశీలించి పంచనామా చేస్తారు. నివేదికను ఆన్‌లైన్‌లో ఆర్డీవోకు పంపిస్తే ఆయన తిరస్కరించడమో, లేక ఆమోదించడమో చేస్తారు. దరఖాస్తును భూభారతి పోర్టల్‌లో నమోదు చేసి 30 రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ కోసం గడవు ఇస్తారు. గడువులోగా ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఆ భూమికి హక్కుల నమోదు ప్రక్రియను నిలిపివేస్తారు. దరఖాస్తుదారు సమర్పించే అఫిడివిట్‌లో సమాచారం తప్పుగా తేలితే చెల్లించిన ఫీజులు, స్టాంపు డ్యూటీ జప్తు చేయడంతోపాటు, క్రిమినల్‌ కేసు నమోదు చేస్తారు. దీంతో ఆరేళ్లుగా హక్కులు లేక సాగులోనే ఉన్న రైతులకు భూయజమాన్య హక్కులు పొంది పట్టాలు పొందేందుకు వీలు కలుగనుంది.

సాదాబైనామా దరఖాస్తులు

మండలం దరఖాస్తులు సర్వే నంబరు

అంతర్గాం 903 1075

ధర్మారం 2,294 2685

ఎలిగేడు 1,215 1471

జూలపల్లి 1,220 1408

ఓదెల 3,557 4334

పాలకుర్తి 1,385 1523

పెద్దపల్లి 5,939 6822

రామగుండం 412 478

కాల్వశ్రీరాంపూర్‌ 5,670 6461

సుల్తానాబాద్‌ 3,556 4107

కమాన్‌పూర్‌ 532 655

మంథని 4,563 5211

ముత్తారం 2,834 3194

రామగిరి 1,243 1431

30 రోజుల్లో అభ్యంతరాలు లేకపోతే..

నాదాబైనామా నిబంధనల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలోని 6(3) నిబంధన ప్రకారం.. భూహక్కుల కోసం దరఖాస్తు చేసే సమయంలో దరఖాస్తుదారుతోపాటు భూమి విక్రయించిన వ్యక్తి సైతం అఫిడవిట్‌ సమర్పించాల్సి ఉండేది. దీంతో క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు ఎదురై సమస్యలు అలాగే ఉండిపోయాయి.

Advertisement
 
Advertisement
Advertisement