పెద్దపల్లి: వచ్చే ఏడాది నిర్వహించే గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు వేగంగా చేయాలని, ప్రధానంగా ఘాట్ల వరకు రోడ్లు సకాలంలో నిర్మించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఇంజినీరింగ్ చీఫ్ మోహన్‌నాయక్‌తో కలిసి కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల అధికారులతో గోదావరి పుష్కర ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లాలోని మంథని, గోలివాడ, గోదావరిఖని పుష్కరఘాట్లకు రహదారులు నిర్మించాలని ఆయన అన్నారు. గోదావరిఖని సమ్మక్క– సారలమ్మ జాతర వద్ద 50 శాతం శాశ్వత పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఆర్ అండ్ బీ ఈఈ భావ్‌సింగ్, మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
ఆయుర్వేద సేవలు సద్వినియోగం చేసుకోవాలి
ఆయుర్వేదం, యునాని, హోమియోపతి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష కోరా రు. జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా ఆస్పత్రి ఆవరణలో ఉచిత ఆయుష్ వైద్యశిబిరం నిర్వహించగా కలెక్టర్ మాట్లాడారు. ఆయుష్ ఆస్పత్రిలో రోజూ 100 నుంచి 120 మంది అవుట్ పేషెంట్లు వైద్యసేవలు వినియోగించుకుంటున్నారని తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ప్రమోద్‌కుమార్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ పాల్గొన్నారు.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
రోజూ యోగా సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఆయుష్ జిల్లా ఇన్‌చార్జి డాక్టర్ అరుణ అ న్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ని ర్వహించిన యోగా కార్యక్రమంలో ఆమె మాట్లాడా రు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


