చలివేంద్రాలు ఏర్పాటు చేయండి | - | Sakshi
Sakshi News home page

చలివేంద్రాలు ఏర్పాటు చేయండి

Apr 11 2026 9:10 AM | Updated on Apr 11 2026 9:10 AM

● స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి ● బల్దియా కమిషనర్‌ అరుణశ్రీ

కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని బల్దియా కమిషనర్‌ అరుణశ్రీ కోరారు. వార్డు అధికారులతో శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కమిషనర్‌ మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థలు, వివిధ అసోసియేషన్ల సహకారంతో చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకోవాలన్నారు. ఎవరూ ముందుకు రానిచోట బల్దియా ద్వారా చలివేంద్రాలు ఏర్పాటు చేద్దామని అన్నారు.

ఆస్తిపన్నుపై రాయితీ..

ఈనెల 30వ తేదీలోగా చెల్లించిన వారికి ఆస్తిపన్నుపై 5 శాతం రాయితీపై ప్రచారం కల్పించాలని అరుణశ్రీ అన్నారు. మొక్కలు నాటడానికి అనువైన ప్రాంతాల జాబితా ఇవ్వాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు కేటాయించిఉన్న వారిని ఎల్‌ –2 నుంచి ఎల్‌ –1 కేటగిరీలో చేర్చాలని అన్నారు. జనగణన హెచ్‌ఎల్‌బీ పూర్తి చేయాలని కోరారు. అమృతం యాప్‌లో నల్లా కనెక్షన్‌ వివరాలు అప్‌లోడ్‌ చే యాలని చెప్పారు. డిప్యూటీ కమిషనర్‌ వెంకటస్వా మి, ఎస్‌ఈ గురువీర, ఈఈ రామన్‌, అసిస్టెంట్‌ క మిషనర్‌ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్రీహరి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement