విజయనగరం: జిల్లా స్థాయిలో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రెడ్డి శంకరరావు, కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ఈ మేరకు శనివారం నగరంలోని బాడీ ఫిట్నెస్ జిమ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులను అభినందించారు. జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు త్వరలో శ్రీకాకుళం జిల్లాలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభతో విజేతలుగా నిలిచిన మహరాష్ట్రలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాలని అభిలాషించారు. జాతీయ స్థాయిలో రాణించిన వారికి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇటువంటి సువర్ణావకాశాన్ని అందిపుచ్చుకుని విజయనగరం కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డి.శ్రీనివాసరావు, నమ్మి ప్రసాద్, డి.సన్నిబాబు తదితరులు పాల్గొన్నారు.


