ఇల్లు పీకి పందిరి..! | - | Sakshi
Sakshi News home page

ఇల్లు పీకి పందిరి..!

Dec 8 2025 8:08 AM | Updated on Dec 8 2025 8:08 AM

ఇల్లు

ఇల్లు పీకి పందిరి..!

ఇల్లు మంజూరైందంటే తొలగించాం..

ఇప్పటికై నా స్పందించండి

సీతంపేట: అదో మారుమూల గిరిజన గ్రామం. అటు శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం.. ఇటు పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండల సరిహద్దున చిట్టచివరన ఉంది. ఇక్కడ 38 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరి జీవితాలతో అధికారులు బంతాట ఆడుతున్నారు. ఆ గ్రామమే సీతంపేట మండలంలోని అత్యంత మారుమూల గిరిజన గ్రామం నారాయణగూడ. ఈ గ్రామానికి అన్నీ సమస్యలే ఉన్నా.. ప్రధానమైనది ఇంటి సమస్య. వీరిలో కొందరికి కేంద్ర ప్రభుత్వం పీఎం జన్‌మన్‌ పథకంలో పీవీటీసీ(పర్టికులర్లీ వాలనర్‌బుల్‌ ట్రైబ్‌ గ్రూప్‌)కు గృహాలు మంజూరు చేసింది. దీనిలో భాగంగా ఈ గ్రామంలో 13 మంది వరకు ఇళ్లు లేని వారికి గృహాలను శాంక్షన్‌ చేశారు. అప్పటి వరకు ఆ గిరిజనులు వారి స్థలాల్లో పూరి గుడిసెలు, రేకిళ్లలో నివసిస్తున్నారు. అయితే గృహాలు మంజూరయ్యాయనే ఉద్దేశంతో ఉన్న గుడిసెలను తొలగించారు. వాటి స్థానంలో కొత్తవి నిర్మించుకోవడానికి వీలుగా పునాదులు తవ్వడానికి సవర జ్యోతమ్మ, రెయ్యమ్మ, లక్కమ్మ, గంగమ్మ, బొగ్గులమ్మ తదితరులు సిద్ధమయ్యారు. ఇంటి నిర్మాణం కోసం బేస్‌మెంట్‌ లెవెల్‌ కొలతలు తీశారు. అంతే ఇంతలో ఫారెస్టు సెక్షన్‌ అధికారులు వచ్చి ఇక్కడ ఇళ్లు నిర్మించవద్దని, అటవీ శాఖ పరిధిలో ఉన్నందున కట్టడానికి వీల్లేదని చెప్పడంతో నిర్మాణాలు నిలిపేశారు. ఏం చేయలేని స్థితిలో ఉన్న ఇళ్లు తీసివేయడంతో నిలువునీడ కరువైంది. మళ్లీ చిన్నచిన్న గుడిసెలు వంటివి నిర్మించుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం విపరీతమైన చలి, మంచు పడుతుండడంతో పిల్లాపాపలతో ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. కొత్త ఇళ్లు మంజూరయ్యాయంటేనే తమకు ఉన్న ఇళ్లు పీకేసామని, ఇంతలో అటవీ శాఖ అధికారులు అడ్డుపడడంతో ఏం చేయాలో తోచడం లేదని ఆ కుటుంబాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు పీఎం జన్‌మన్‌ కింద ఇళ్లు మంజూరైతే... మరోవైపు అటవీ శాఖ పేరిట అడ్డంకుల పేరిట నిర్మాణాలను నిలిపేయడంతో అధికారుల బంతాటలో వారు నలిగిపోతున్నారు. ఇదిలా ఉంటే ఆ గ్రామంలో మరికొన్ని సమస్యలు ఉన్నాయి. సీసీ రహదారులు లేవు. పాఠశాల, అంగన్‌వాడీ సెంటర్‌ వంటివి లేకపోవడంతో కొద్ది దూరంలో ఉన్న లోకొత్తవలస గ్రామానికి పిల్లలు వెళ్తున్నారు. రేషన్‌ తెచ్చుకోవాలన్నా అవస్థలు పడాల్సిందే. గ్రామానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కుశిమి గ్రామానికి వెళ్తున్నామని గిరిజనులు తెలిపారు. గతంలో రేషన్‌ ఇంటికి వచ్చేదని ఇప్పుడు నడకయాతన తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హౌసింగ్‌ ఏఈ ఏమన్నారంటే...

హౌసింగ్‌ ఏఈ వెంకటేష్‌ వద్ద ఈ విషయం ప్రస్తావించగా ఆర్‌వోఎఫ్‌ఆర్‌లో గ్రామం ఉండడంతో ఫారెస్టు అనుమతులు రావాల్సి ఉందన్నారు. ఇందుకు రెవెన్యూ శాఖ ద్వారా ప్రతిపాదించాం. శ్రీకాకుళం జిల్లా నుంచి ఫారెస్టు క్లియరెన్స్‌ వచ్చిన వెంటనే పొజిషన్‌ సర్టిఫికెట్‌ ఇప్పించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్మాణాలకు చర్యలు తీసుకుంటాం.

ముందు భాగంలో ఉన్న ఇంటిని పడగొట్టి ప్రస్తుతం నివసిస్తున్న గిరిజన గుడిసెలు

ఇల్లు మంజూరైందంటే ఉన్న ఇల్లు తొలగించాం. చాలా అవస్థలు పడుతున్నాం. కొత్త గృహం నిర్మించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. గత రెండు నెలలుగా ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు మాకు అనుమతులు వస్తే అప్పుడు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంతవరకు చాలా అవస్థలు పడాల్సి వస్తుంది.

– ఎస్‌.సుమిత్ర, నారాయణగూడ

గిరిజన జీవితాలతో అధికారుల బంతాట!

ఇళ్లు మంజూరయ్యాయంటే ఉన్న ఇళ్లు పీకి పందిరేసుకున్నారు..

ఆ స్థలంలో పునాదులు తవ్వేసరికి అటవీ శాఖ అధికారుల అడ్డంకి

ఉన్న ఇళ్లు లేవు.. కొత్త ఇళ్లు రావు..

చలి, మంచులో కాలం నెట్టుకొస్తున్న గిరిజనులు

దీనావస్థలో నారాయణగూడ గ్రామస్తులు

అన్ని గ్రామాల్లో పీఎం జన్‌మన్‌ పథకంలో గృహాలు నిర్మించుకుంటున్నారు. మాకు వచ్చేసరికి ఫారెస్టు అధికారులు నిలుపుదల చేశారు. దాదాపు 30 ఏళ్లుగా ఇక్కడే నివిసిస్తున్నాం. పూర్తి స్థాయిలో గృహాలు లేక అవస్థలు పడుతున్నాం. ఇప్పటికై నా మంజూరు చేయాలని కోరుతున్నాం.

– ఎస్‌.ప్రసాదు, నారాయణగూడ

ఇల్లు పీకి పందిరి..! 1
1/4

ఇల్లు పీకి పందిరి..!

ఇల్లు పీకి పందిరి..! 2
2/4

ఇల్లు పీకి పందిరి..!

ఇల్లు పీకి పందిరి..! 3
3/4

ఇల్లు పీకి పందిరి..!

ఇల్లు పీకి పందిరి..! 4
4/4

ఇల్లు పీకి పందిరి..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement