ఎవడ్రా మనల్ని ఆపేది!
వరహాలగెడ్డ ఆక్రమణ స్థలంలో మరోసారి కంచె ఏర్పాటు
వామపక్ష, ప్రజాసంఘాలు తొలగించిన కాసేపటికే యథాస్థితిలో..
మరోవైపు వరహాలగెడ్డ ఆక్రమణలు, అక్ర మ రిజిస్ట్రేషన్‌ల విషయంలో సబ్ కలెక్టర్ వైశాలి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న సర్వే నంబర్లు.. తర్వా త ఎవరి ఆధీనంలోకి వెళ్లాయి.. ఎవరె వరి చేతులు మారాయి అన్న వివరాలను సేకరిస్తున్నారు. ఆక్రమణదారులందరికీ నోటీ సులు పంపించి, వివరణ కోరారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన సబ్‌రిజిస్ట్రార్ నుంచి కూడా వివరణ కోరినట్లు తెలుస్తోంది.
సాక్షి, పార్వతీపురం మన్యం: వరహాలగెడ్డ ఆక్రమణదారుల్లో దూకుడు తగ్గడం లేదు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారుల నుంచి రక్షించాలని వామపక్ష, ప్రజాసంఘాలు ఎంతగా పోరాడుతు న్నా.. అధికారుల్లో చలనం లేకపోవడంతో ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. జిల్లా కేంద్రంలోని సర్వే నంబర్ 410 వరహాలగెడ్డ స్థలం ఆక్రమణ, అక్రమ రిజిస్ట్రేషన్‌పై కొన్నాళ్లుగా వివాదం నడుస్తున్న విషయం విదితమే. అధికారులు ఆ భూమిని చదును చేసి, హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినా ఫలితం లేకపోతోంది. రెండు రోజుల కిందట లోపలికి ఎవరూ వెళ్లడానికి వీలులేనివిధంగా అక్కడ అన ధికార కంచె ఏర్పాటైంది. ఇది గమనించిన వామపక్ష, ప్రజాసంఘాల నాయకులు బుధవా రం ఆ స్థలంలోకి వెళ్లి, దౌర్జన్యంగా కంచెను తొ లగించారు. పోలీసులు సైతం వచ్చి దీనిని వీడి యో చిత్రీకరించారు. ఆ సాయంత్రానికే మరలా యథాస్థానంలో కంచె వెలిసింది. వివాదంలో ఉన్న స్థలం వద్ద మళ్లీ కంచె వేసి, ఇటు అధికారులకు.. అటు ప్రజాసంఘాల నాయకు లకూ సవాల్ విసిరినట్లయ్యింది.
సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు
ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న వరహాలగెడ్డ స్థలంలో కంచె నిర్మాణం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వామపక్ష, ప్రజాసంఘాల నాయకులు కొల్లి గంగునాయుడు, ఈశ్వరరావు, జీవా, పి.రంజిత్‌కుమార్, గొర్లె వెంకటరమణ, బీవీ రమణ తదితరులు డిమాండ్ చేశారు. కంచె నిర్మాణంలో పట్టణానికి చెందిన వైద్యుడు డాక్ట ర్ రామ్మోహన్‌రావు పేరు వినిపిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు గురువారం సబ్‌కలెక్టర్ ఆర్.వైశాలిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే గెడ్డ స్థలాన్ని ఆక్రమించి, ఆస్పత్రి నిర్మాణాలు చేపట్టినట్లు ప్రజలు ఆరోపిస్తున్నార ని తెలిపారు. స్వాధీనం చేసుకున్న భూమిలో మొక్కలు నాటే ప్రయత్నం చేసి ఆక్రమణలకు సిద్ధపడుతున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.
ఎవడ్రా మనల్ని ఆపేది!
ఎవడ్రా మనల్ని ఆపేది!


