9 న కాలంచెల్లిన వస్తువుల బహిరంగ వేలం
విజయనగరం క్రైమ్: ఈ నెల 9 వ తేదీన జిల్లా పోలీస్ కార్యాలయంలో కాలం చెల్లిన వస్తువులను వేలం వేయనున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ మంగళవారం తెలిపారు. జిల్లా పోలీసు శాఖ వినియోగించిన, కాలం చెల్లిన జనరేటర్లు, బ్యాటరీలు, ఎలక్ట్రికల్ వస్తువులు (ఫ్యాన్స్, టేబుల్స్ వగైరా), ఎలక్ట్రానిక్ వస్తువులు (రిఫ్రిజిరేటర్లు, వాటర్ డిస్పెన్సర్లు, డీప్ ఫ్రీజర్లు, ఏసీలు), ఫర్నిచర్ వస్తువులు, ఐరన్ స్క్రాప్, మిగతా వస్తువులు 8 స్లాట్లుగా విభజించామన్నారు. ఈ వస్తువులకు బహిరంగ వేలం నిర్వహించనున్నామని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. వేలం వేయనున్న వస్తువులను డీపీఓ ప్రాంగణంలో భద్రపర్చామని ఆసక్తి కలిగిన వేలందారులు డిసెంబరు 3 నుంచి 8 వరకు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరిశీలించుకోవచ్చునన్నారు. వివరాల కోసం విజయనగరం ఏఆర్ అడ్మిన్ ఆర్‌ఐ ఎన్.గోపాల నాయుడు ఫోన్ నంబర్ 9121109485 ను సంప్రదించవచ్చునని ఎస్పీ తెలిపారు. వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి కలిగిన బిడ్డర్లు డిసెంబరు 9న ఉదయం 10గంటలకు జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణం వద్ద నిర్వహించే వేలంలో పాల్గొనాలన్నారు. ఆసక్తి కలిగిన బిడ్డర్లు అదే రోజున బిడ్ అమౌంట్ను జీఎస్టీతో సహా ఆన్‌లైన్‌లో చెల్లించి, వస్తువులను 24గంటలలో తీసుకుని వెళ్లాలని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ వివరించారు.


