ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఉణుకూరు యువకుడి ప్రతిభ
రేగిడి: మండల పరిధిలోని ఉణుకూరు గ్రామానికి చెందిన ఎందువ రాహుల్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటాడు. గత నెల 28 నుంచి 30 వరకు హంగేరీలో జరిగిన కెటిల్‌బెల్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొని 48 కేజీల విభాగంలో ద్వితీయ స్థానం సాధించి భారత జాతీయ పతాకాన్ని ఆ దేశంలో రెపరెపలాడించాడు. రాహుల్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. ఆయన తండ్రి ఎందువ రామకృష్ణ ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంగా శిర్లాం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. మండలానికి చెందిన యువకుడు ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లాతోపాటు రేగిడి మండలాన్ని నిలబెట్టడంతో గ్రామస్తులు, ఉపాధ్యాయులు, యువకులు అభినందించారు. మంగళవారం ఈ విషయాన్ని రాహుల్ తండ్రి ఎందువ రామకృష్ణ విలేకరులకు తెలిపారు.
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఉణుకూరు యువకుడి ప్రతిభ


