అనుమానాస్పద స్థితిలో ఆర్టీసీ డ్రైవర్ మృతి
పాలకొండ రూరల్: మండలంలోని బుక్కూరు ఎస్సీవీధిలో నివాసముంటున్న పాలకొండ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న జామి విఠల్‌రావు (49) అనుమానాస్పద రీతిలో మృతి చెందినట్లు ఎస్సై కె.ప్రయోగమూర్తి తెలిపారు. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సోమవారం రాత్రి తన ఇంట్లో నిద్రించిన విఠల్‌రావు మంగళవారం ఉదయం విగత జీవిగా ఉండడాన్ని గుర్తించిన ఆయన తండ్రి రామప్పడు షాక్‌కు గురుయ్యారు. కరుణ అనే మహిళతో ఇటీవల విఠల్‌రావుకు వివాహమైంది. భార్య శ్రీకాకుళంలో ఉండడంతో భర్త మరణించినట్లు సమాచారం ఆమెకు అందించారు. ఆమె బుక్కూరు చేరుకుని భర్త మృతదేహంపై గాయాలున్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆమె అందించిన ఫిర్యాదుతో పోలీసులు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీఐ ఆమిటి ప్రసాద్ వివిధ కోణాల్లో తమదైన శైలిలో దృష్టి పెట్టామని చెప్పారు. తమ ఉద్యోగి జేవీ రావు మృతిపట్ల ఈయూ జోనల్ సెక్రటరీ బీకే.మూర్తి, సహ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
లారీ వ్యాన్ ఢీ
● వ్యాన్ డ్రైవర్ మృతి
దత్తిరాజేరు: మండలంలోని ఎస్ బూర్జవలస పోలీస్‌స్టేషన్ పరిధి మర్రివలస వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశాకు చెందిన వ్యాన్ డ్రైవర్ మృతి చెందినట్లు ఎస్సై జి.రాజేష్ తెలిపారు. ఈ ప్రమాదంపై ఎస్సై, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రామభద్రపురం నుంచి వస్తున్న లారీ మరడాం నుంచి బొబ్బిలి వైపు వెళ్తున్న వ్యాన్‌ను ఢీకొనడంతో వ్యాన్ డ్రైవర్ తీవ్ర గాయాల పాలు కాగా 108లో విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుటుంబ వివరాలు, చిరునామా తెలియాల్సి ఉందని కుటుంబసభ్యులు బుధవారం వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయనున్నామని ఎస్సై తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో ఆర్టీసీ డ్రైవర్ మృతి
అనుమానాస్పద స్థితిలో ఆర్టీసీ డ్రైవర్ మృతి


