సమస్యలు వినరు..
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 3 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
● పీజీఆర్‌ఎస్పై సడలుతున్న నమ్మకం
● విజ్ఞప్తులు బుట్టదాఖలు
● పదేపదే తిరుగుతున్నా ఫలితం ఉండకపోవడమే కారణం
సాక్షి, పార్వతీపురం మన్యం:
కలెక్టరేట్లో ఒకటో తేదీ సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన వినతుల సంఖ్య 69... అంతకు ముందు వారం 92... ఆ క్రితం వారం 99... రోజురోజుకూ వివిధ సమస్యలపై కలెక్టర్ కార్యాలయానికి వచ్చి, అర్జీలు ఇచ్చే వారి సంఖ్య తగ్గిపోతుంది అంటే... సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినట్లు కాదు... తాము చెప్పుకున్నా, వినతులకు ఇక్కడ మోక్షం దొరకడం లేదన్న అభిప్రాయంతో పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి వస్తున్న వారు క్రమేపీ తగ్గిపోతున్నారు. చిన్న చిన్న సమస్యలకు కూడా ఇక్కడ పరిష్కారం లభించడం లేదన్న అభిప్రాయం బలంగా ప్రజల్లో వినిపిస్తోంది. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసమని ప్రత్యేకంగా వినతుల స్వీకరణ నిర్వహిస్తున్నారు. వచ్చిన విజ్ఞప్తుల్లోనూ సగం వరకూ రెవెన్యూ సమస్యలపైనే ఉంటున్నాయి. ఈ సోమవారం మొత్తం 69 వినతులు రాగా.. అందులో రెవెన్యూపరమైనవి 31, సాధారణ అర్జీలు 38 ఉండటం గమనార్హం. కొద్ది రోజుల కిందటి వరకు ప్రతి వారం 150కి పైగా అర్జీలు అందేవి.
క్షేత్రస్థాయిలో పరిష్కారం కాకనే...
క్షేత్ర స్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధుల అలసత్వం కారణంగా గ్రామాల్లో సమస్యలు కోకొల్లలుగా ఉండిపోతున్నాయి. అర్హులై ఉన్నప్పటికీ పథకాలు అందకపోవడం, ఆక్రమణలు, సామాజిక, వ్యక్తిగత ఇబ్బందులు, రాజకీయ వేధింపులు, ఆన్‌లైన్‌లో తప్పిదాలు, భూములకు సంబంధించినవి, రహదారులు కావాలని.. ఇలా అనేక విధాలా సమస్యలపై క్షేత్ర స్థాయిలో అడిగి అడిగి అలసిపోయి, జిల్లా కేంద్రానికి వస్తుంటారు. ప్రతివారం సుమారు 200 మంది వరకూ వ్యయ ప్రయాసలకు ఓర్చి ఉన్నతాధికారులపై నమ్మకంతో పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందిస్తున్నారు. మళ్లీ వాటిని క్షేత్రస్థాయికి పంపించడం, ఆన్‌లైన్లో పెండింగ్‌లో చూపకుండా క్లియర్ చేసేయడం వంటి చర్యల వల్ల ఆ సమస్యలు అలానే ఉండిపోతున్నాయి. అందువల్లే ప్రతివారం వస్తున్న వినతుల్లో రీఓపెన్ అయినవే అధికంగా ఉంటున్నాయి.
ముందే స్క్రూటినీ..?
ఇటీవల కాలంలో కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ వద్ద వివిధ దశలను ఏర్పాటు చేశారు. ముందుగానే కొన్ని విభాగాలకు వచ్చిన వినతులను ఆయా కౌంటర్ల వద్ద పరిశీలిస్తున్నారు. చాలా వినతులను లోపలికి వెళ్లనీయకుండా అక్కడే ఏదో కారణం చెప్పి, వెనక్కి
సమస్యలు వినరు..


