 
															విద్యుత్‌షాక్‌తో రెండు ఆవుల మృతి
మెరకముడిదాం: మండలంలోని కొత్తకర్ర గ్రామంలో విద్యుత్‌షాక్ తగిలి రెండు ఆవులు మృతిచెందాయి. గురువారం జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చెందిన సబ్బిపైడితల్లి, సబ్బిరామప్పమ్మలకు చెందిన రెండు పాడి ఆవులను మేతకు తొలుకుని వెళ్లగా ఆవులు మేస్తుండగా విద్యుత్‌సరఫరా అవుతున్న విద్యుత్ తీగలు కిందపడిఉండడంతో ఆవులు వాటిని గమనించకపోవడంతో తీగలు తగిలి విద్యుత్‌షాక్‌కు గురయ్యాయి. దీంతో రెండు ఆవులు అక్కడికక్కడే మృతిచెందాయి. విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుడు బూర్లెనరేష్‌కుమార్ వెంటనే సంఘటనా స్ధలానికి చేరుకుని అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఇన్‌చార్జ్ పశువైద్యాధికారి హైమావతి, తహసీల్దార్ సులోచనరాణి, వీఆర్‌ఓ బి.లక్ష్మణరావు, లైన్‌మన్ వెంకటరావులు సంఘటనా స్ధలానికి చేరుకుని ఆవుల మృతికి గల కారణాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. నివేదికను ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి అందజేస్తుమని అధికారులు తెలిపారు. రెండు ఆవులు మృతిచెందడంతో జీవనోపాధి కోల్పోయామని బాధిత రైతులు భోరున విలపిస్తున్నారు.
ఐదు మేక పిల్లల మృత్యువాత
కురుపాం: మోంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కురుపాం మండలంలోని ఉదయపురం పంచాయతీ అధ్వానం గూడ గిరిజన గ్రామానికి చెందిన బిడ్డిక వెంకటరావు ఐదు మేక పిల్లలు గురువారం మృత్యువాత పడ్డాయి. మరి కొన్ని మేకలు తడిచిపోయి తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు బాధిత మేకల యజమాని తెలిపాడు.
 
							విద్యుత్‌షాక్‌తో రెండు ఆవుల మృతి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
