 
															రాష్ట్రస్థాయి పోటీలకు జోగింపేట విద్యార్థులు
సీతానగరం: మండలంలోని జోగింపేట స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ గిరిజన ప్రతిభ (ఎస్‌ఓఈ) విద్యాలయం విద్యార్థులు క్రీడల్లో రాష్ట్రస్థాయిపోటీలకు ఎంపికావడం అభినందనీయమని ప్రిన్సిపాల్ ఎం.ధర్మరాజు అన్నారు. ఈ మేరకు మండలంలోని జోగింపేటలో గరువారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్‌ఓఈ ఇతర విద్యాలయాల 19మంది విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో తమ విద్యాలయానికి చెంది విద్యార్థులు ప్రతిభ కనబరిచారని తెలియజేశారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఎంపికకు జిల్లా స్థాయిలో ఆర్చరీ పోటీలు పార్వతీపురం, వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు గుంటూరు, వాలీబాల్ పోటీలు విజయనగరంలో జరిగాయి. 31న చిత్తూరులో స్టేట్‌మీట్ పోటీలు జరుగుతాయని తెలియజేశారు. క్రీడల్లో ప్రతిభ కనబర్చిన జై ప్రసాద్ (ఆర్చరీ), రాజ్యన్ వెయిట్‌లిఫ్టింగ్ (సిల్వర్), అండర్ 19లో కె భానుప్రసాద్ వాలీబాల్ పోటీల్లో విజేతలుగా నిలవడం అభినందనీయమన్నారు. వారందరినీ ప్రిన్సిపాల్ బి.ధర్మరాజు, పీడీ ఎం.ఉదయ్‌కుమార్, సిబ్బంది అభినందించారు.
ఇద్దరు సెల్‌ఫోన్ దొంగల అరెస్ట్
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని గద్రజోల గ్రామంలో గురువారం ఉదయం సెల్‌ఫోన్లు దొంగతనం చేస్తుండగా ఇద్దరు యువకులను గ్రామస్తులు పట్టుకున్నారు. ఈ సమాచారాన్ని ఎల్విన్‌పేట పోలీసులకు తెలియపర్చగా పోలీసులు గ్రామానికి వెళ్లి పట్టుబడిన యువకుల్ని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్సై బి.శివప్రసాద్ మాట్లాడుతూ పట్టుబడిన యువకుల నుంచి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, ఈ యువకులు ఇంకెక్కడైనా, ఏదైనా దొంగతనాలకు పాల్పడ్డారా? అనే విషయాలపై దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
