ఆశ్రమ పాఠశాల విద్యార్థికి పచ్చకామెర్లు
● ఆస్పత్రిలో చికిత్స
సాలూరు రూరల్ /పాచిపెంట: మండలంలోని పీఎన్ బొడ్డవలస డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి దాడి క్రిస్టోఫర్ వాంతులు విరోచనాలతో పాటు పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతూ గురువారం సాలూరు ఏరియా ఆస్పత్రిలో చేరాడు. పాచిపెంట మండలం తాడూరు గ్రామానికి చెందిన విద్యార్థి తల్లి లక్ష్మి చెప్పిన వివరాల ప్రకారం దసరా సెలవులకు ఇంటికి వచ్చిన పిల్లాడికి పచ్చకామెర్లు సోకడంతో మందులు వాడుతున్నామని అయితే గురువారం వాంతులు, విరోచనాలతో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పాచిపెంట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా అక్కడినుంచి సాలూరు ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేయడంతో తీసుకువచ్చామని తెలిపింది. ప్రస్తుతం ఆ విద్యార్థి వైద్యసేవలు పొందుతున్నాడు.
జ్వరంతో చిన్నారుల చేరిక
పాచిపెంట మండలంలోని పూడి గ్రామానికి చెందిన గెమ్మెల రేణుక, గెమ్మెల దివ్య ఒకరు ప్రీ స్కూల్, మరొకరు అదే గ్రామంలో 1వ తరగతి చదువుతున్నారు. ఇద్దరికీ జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండడంతో గురువారం వారి తల్లి సాలూరు ఏరియా ఆస్పత్రిలో చేర్పించింది. ఆస్పత్రిలో ఇద్దరూ ఒకే మంచంపై వైద్యసేవలు అందుకుంటున్నారు.
ఆశ్రమ పాఠశాల విద్యార్థికి పచ్చకామెర్లు


