
గ్రోమోర్ సెంటర్‌లో విజిలెన్స్ తనిఖీలు
గంట్యాడ: మండలంలోని కొఠారుబిల్లి జంక్షన్‌లో ఉన్న గ్రోమోర్ సెంటర్‌ను విజిలెన్స్, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా బుధవారం తనిఖీ చేశారు. స్టాక్‌కు, ఈపాస్‌లో ఉన్న వివరాలు సమానంగా ఉన్నాయా? లేదా? కాలపరిమితి దాటిన ఎరువులు ఉన్నాయా? అని తనిఖీ చేశారు. మొక్కల ఎదుగుదలకు సంబంధించి వినియోగించే ఉత్ప్రేరకాలు కాలపరిమితి దాటడంతో రూ.7.50 లక్షలు విలువ చేసే స్టాక్‌కు స్టాప్ సేల్స్ ఆర్డర్స్ ఇచ్చారు. నెల రోజులలోగా స్టాక్‌కు సంబంధించి లైసెన్స్ రెన్యువల్ చేసుకోకపోతే 6ఎ కేసు నమోదు చేయాలని ఏఓ శ్యామ్‌కుమార్‌కు విజిలెన్స్ అధికారులు సూచించారు. ఈ తనిఖీల్లో పలాస ఏడీఏ రామారావు, విజిలెన్స్ ఎస్సై అప్పలనాయుడు పాల్గొన్నారు.
రూ.7.50 లక్షల విలువైన స్టాక్‌కు స్టాప్‌సేల్స్ ఆదేశాలు