శతాధిక వృద్ధుడి మృతి
వీరఘట్టం: వీరఘట్టం పట్టణానికి చెందిన శతాధిక వృద్ధుడు వూణ్న రామలింగేశ్వరుడు(103) గురువారం తెల్లవారుజామున మృతిచెందారు. ప్రస్తుత జనరేషన్‌లో 25–30 ఏళ్ల లోపే చాలా మందికి సుగర్, బీపీ, చూపు మందగించడం వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఆయనకు నేటివరకు జ్వరం అనే మాట కూడా తెలియదని ఆయన కుమారుడు సురేష్ తెలిపారు. కళ్లజోడు లేకుండా న్యూస్‌పేపర్ ప్రతిరోజూ చదివేవారని, బుధవారం రాత్రి భోజనం చేసి పడుకున్న తన తండ్రి నిద్రలోనే కన్నుమూశారని చెప్పారు. ఇన్నాళ్లూ ఒకరిపై ఆధారపడకుండా అందరికీ ఆదర్శంగా రామలింగేశ్వరుడు ఉన్నారన్నారు.


