రైతుకు నష్టం | - | Sakshi
Sakshi News home page

రైతుకు నష్టం

May 14 2025 2:16 AM | Updated on May 14 2025 2:16 AM

రైతుక

రైతుకు నష్టం

–8లో
అకాలవర్షం..

ఉక్కపోతతో ‘షాక్‌’

వేసవి తీవ్రత దృష్ట్యా రోజురోజుకు ఎండలు ముదురుతున్నాయి. రోజువారీ ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు

నమోదవుతున్నాయి.

బుధవారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2025

జిల్లాలో సుమారు 70 వేల ఎకరాల్లో జీడి తోటలు ఉన్నాయి. దాదాపు 30 వేల కుటుంబాలకు పైగా వీటిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. మన్యం ప్రాంతంలో విరివిగా పండే వాణిజ్య పంట ఇది. ఒకవైపు తెగుళ్లు, మరోవైపు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏటా నష్టపోతున్నామని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. భామిని తదితర మండలాల్లో మొక్కజొన్న రైతులు కూడా వర్షాలకు నష్టపోతున్నారు. గింజలను ఆరబెడుతున్న సమయంలో ఒక్కసారిగా వర్షం వల్ల తడిచిపోతున్నాయని చెబుతున్నారు. కురుపాం నియోజకవర్గంలోని గరుగుబిల్లి, జియ్యమ్మవలస మండలాల్లో నువ్వులు, మొక్కజొన్న, అరటి పంటలకు నష్టం వాటిల్లుతోంది. కోసిన నువ్వు పంట ఆరబెట్టే సమయంలో వర్షాలు కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గాలులు, వర్షాలతో జిల్లా రైతాంగం నష్టపోతున్నా ప్రభుత్వం నుంచి స్పందన ఉండడం లేదు. 33 శాతం నష్టం వాటిల్లితేనే పరిహారం అందుతుందన్న ప్రభుత్వం నిబంధనలు శరాఘాతంగా మారుతున్నాయి.

సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో ఓవైపు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వడగాల్పులు బెంబేలెత్తిస్తున్నాయి. మరోవైపు వాతావరణం ఒక్కసారిగా మారుతూ.. గాలులతోపాటు వర్షం కురుస్తోంది. మండు వేసవిలో వర్షం కాస్త ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ.. జోరుగా వీస్తున్న గాలులు ఉద్యాన, వాణిజ్య పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి రైతులను కలవరపెడుతోంది. సోమవారం సాయంత్రం గాలులతో పాటు కురిసిన వర్షానికి పాలకొండ మండలంలోని పాలకొండ, బుక్కూరు, రుద్రిపేట, అట్టలి, వెలగవాడ తదితర ప్రాంతాల్లో జీడి, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. బొప్పాయి, అరటి తదితర చెట్లు నేలకొరిగాయి. తుమరాడ, గరుగుబిల్లి గ్రామాల్లో కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. సీతంపేట మండలంలోనూ అరటి, జీడి, మామిడి పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అటు భామిని, బలిజిపేట, సీతానగరం మండలాల్లోనూ గాలులతో పాటు కురుస్తున్న వర్షం వల్ల జీడి, మామిడి పంటలు దెబ్బతిని కాయలు నేలరాలాయి. నేల రాలిన జీడిపిక్కలు రంగు మారడంతో నష్టపోతున్నట్లు రైతులు చెబుతున్నారు. నాణ్యత లేకపోవడంతో దళారులు కిలో రూ.100 చొప్పున కొనుగోలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్‌రీల్‌

ఆందోళనలో రైతాంగం

గాలులకు నేలకొరుగుతున్న మామిడి, అరటి

ఆదుకోని యంత్రాంగం

పిడుగులతో ప్రాణ నష్టం

వర్షంతో పాటు.. పిడుగులు పడటం వల్ల అటు ప్రాణా నష్టం కూడా సంభవిస్తోంది. మెంటాడ మండలంలోని కుంటినవలస గ్రామానికి చెందిన కొల్లి రాంబాబు (45) పిడుగుపాటుకు గురై మృతి చెందగా.. సీతానగరం మండలం సుభద్ర సీతారాంపురం గ్రామ సమీపంలో 11 జీవాలు ప్రాణాలు వదిలాయి. దీంతో ఆయా కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.

రైతుకు నష్టం 
1
1/2

రైతుకు నష్టం

రైతుకు నష్టం 
2
2/2

రైతుకు నష్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement