జంతువుల పట్ల క్రూరత్వం తగదు

సమావేశంలో మాట్లాడుతున్న సబ్‌కలెక్టర్‌ 
నూరల్‌కమర్‌  - Sakshi

సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌కమర్‌

పాలకొండ రూరల్‌: జంతువుల పట్ల క్రూరత్వం పదర్శించడం తగతదని, వన్యప్రాణులను వేటాడితే చట్ట ప్రకారం శిక్షతప్పదని సబ్‌కలెక్టర్‌ నూరల్‌కమర్‌ హెచ్చరించారు. తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. సబ్‌ డివిజన్‌లో జంతు క్రూరత్వ నివారణ చట్టం సమర్ధవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. దీనికోసం ప్రత్యేక కమిటీ లు ఏర్పాటుచేసేలా ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసిందన్నారు. 1960 చట్టం మేరకు జంతువులను అక్రమంగా రవాణా చేయడం నేరమని పేర్కొన్నా రు. జంతువుల జనన వివరాలు నమోదుచేయాలన్నారు. ప్రతి ఒక్కరూ వాటిపట్ల స్నేహభావనతో మెలగాలని, ఎటువంటి హాని తలపెట్టవద్దన్నారు. సమావేశంలో డీఎస్పీ జి.వి.కృష్ణారావు, పశుసంవర్థకశాఖ ఏడీ ప్రభామాణిక్యాలరావు, వెటర్నరీ సహా య సర్జిన్‌ బి.సిద్ధార్థ, కమిటీ సభ్యుడు, నగర కమిషనర్‌ ఎస్‌.సర్వేశ్వరరావు, సీఐ కె.మురళీధర్‌, డీఎల్‌ పీఓ జె.రాంప్రసాద్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.లావణ్య, సహాయ కార్మికశాఖ అధికారి కె.కిరణ్‌చంద్ర, దేవదాయశాఖ అధికారి ఎస్‌.రామారావు పాల్గొన్నారు.




 

Read also in:
Back to Top