క్షయ పట్ల అప్రమత్తం

సమావేశంలో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ ఒ.ఆనంద్‌  - Sakshi

పార్వతీపురం టౌన్‌:

క్షయ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ ఒ.ఆనంద్‌ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా కలెక్టర్‌ కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ కూడలి వరకు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌జీఓ హోమ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్షయ అనేది గాలి ద్వారా వ్యాప్తి చెందే అంటు వ్యాధి అని, కోవిడ్‌తో పాటు క్షయ రోగం కూడా ఇబ్భంది కలిగించే సమస్యగా పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని, వాటితో పాటు క్షయ కేసులు కూడా ఉన్నాయన్నారు. 2025 నాటికి టీబీని పూర్తిగా అంతం చేయాలని ఆర్యోగశాఖ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. క్షయ వ్యాధిని చికిత్సతో తగ్గించే అవకాశం ఉందన్నారు. ఎక్కువ కాలం మందులు ఉపయోగించాలని, చికిత్సలో సాధారణంగా 6 నెలల యాంటీబయాటిక్స్‌ తీసుకోవాలని సూచించారు. చికిత్స సమయంలో ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదని ఇంటి వద్దనే ఉండి వ్యాధిని నయం చేసుకోవచ్చన్నారు. రోగనిరోధక శక్తిని పెంచే పోషకాహారం తీసుకోవడం వల్ల మరిత వేగంగా కోలుకోవచ్చని హితవు పలికారు. రెండువారాలకు మించి దగ్గు ఉంటే వైద్యపరీక్ష చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ బి. జగన్నాథరా వు, జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్‌ శ్యా మ్‌కుమార్‌, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు వై వివేక్‌, శేషగిరిరావు, ఛాతీ వైద్యుడు దుర్గా ప్రసాద్‌, ధవళ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

జాయింట్‌ కలెక్టర్‌ ఒ.ఆనంద్‌




 

Read also in:
Back to Top