
గురుకులంలో భోజనం రుచిచూస్తున్న జిల్లా కన్వీనర్ చంద్రావతి
భామిని: ఇష్టంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని పార్వతీపురం మన్యం జిల్లా ఏపీఎస్‌డబ్ల్యూ గురుకులాల సమన్వయకర్త బి.చంద్రావతి పిలుపునిచ్చారు. మనోధైర్యంతో ముందుకు సాగాలని కోరారు. భామినిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. పదో తరగతి బాలికలకు పరీక్షలు రాసేవిధానంపై తర్ఫీదునిచ్చారు. విద్యార్థినులకు వడ్డించిన భోజనాన్ని రుచిచూశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె.విజయనిర్మల, వైస్ ప్రిన్స్‌పాల్ సీహెచ్ రంగారావు, పీఎంసీ కమిటీ చైర్మన్ పి.వెంకటరమణ, బోధనా సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.