
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ నిషాంత్‌కుమార్
పార్వతీపురం: జిల్లాలో నిర్దేశించిన గృహనిర్మాణాల ను మూడువారాల్లో పూర్తిచేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కలెక్టర్ నిషాంత్‌కుమార్ ఆదేశించా రు. గృహనిర్మాణాలపై జిల్లా అధికారులతో శుక్రవా రం సమీక్షించారు. జిల్లాలో ఇప్పటికే 8,916 గృహాల నిర్మాణం పూర్తయిందని, మిగిలిన గృహాలు పూర్తిచేసేందుకు అన్నిశాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆర్‌సీ స్థాయిలో ఉన్న నిర్మాణాలు, సొంత స్థలాల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయాలన్నారు. పొదుపు మహిళలకు రుణాలు మంజూరయ్యేలా చూడాలని డీఆర్‌డీఏ, మెప్మా అధికారులను ఆదేశించారు. సాలూరు, నెలిపర్తి లేఅవుట్లలో తక్షణ మే స్తంభాలు వేయాలన్నారు. ఇంజినీరింగ్ సహాయ కులు ప్రతిరోజు పర్యవేక్షించాలన్నారు. పాలకొండ, సాలూరు, పార్వతీపురం మున్సిపాల్టీ ప్రాంతాల్లో తాత్కాలికంగా నీటి కనెక్షన్లు ఇచ్చామని డీఈ కేజీఎన్ నర్సింగరావు తెలిపారు. సమావేశంలో హౌసింగ్ పీడీ పి.రఘురాం, డీఆర్‌డీఏ పీడీ టి.కిరణ్‌కుమా ర్, డుమా పీడీ కె.రామచంద్రరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ప్రభాకరరావు, హౌసింగ్ ఈఓ రమేష్, మున్సిపల్ కమిషనర్లు జె.రామప్పలనాయుడు, హెచ్.శంకరరావు, ఎస్.సర్వేశ్వరరావు పాల్గొన్నారు.