నేటి నుంచి ఆసరా విజయోత్సవ సభలు

పక్కుడుభద్ర జీడితోటల్లో ఏనుగుల గుంపు   - Sakshi

విజయనగరం గంటస్తంభం: అక్కచెల్లెమ్మలకు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మరో సారి ఆసరా పథకం కింద నిధులు విడుదల చేస్తున్న వేళ నియోజకవర్గ, మండల స్థాయిలో విజయోత్సవ సభలు నిర్వహించాలని జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు సూచించారు. జెడ్పీ సీఈఓ అశోక్‌కుమార్‌తో కలిసి మండల పరిష త్‌ అఽధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీ పీలు, జెడ్పీటీసీ సభ్యులతో శుక్రవారం గూగు ల్‌ మీట్‌లో మాట్లాడారు. మూడోవిడత వైఎస్సార్‌ ఆసరా పథకం కింద విజయనగరం జిల్లాలో 3,92,623 మంది లబ్ధిదారులకు రూ. 251.31 కోట్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 1,88,069 మంది మహిళలకు రూ.94.18 కోట్ల ఆర్థిక లబ్ధి చేకూరునుందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 25 నుంచి ఏప్రిల్‌ 5వ తేదీ వరకు అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో సభలు నిర్వహించాలన్నా రు. సభలకు లబ్ధిదారులందరూ హాజరయ్యే లా చూడాలన్నారు. సచివాలయ కన్వీనర్లు, యువసారథులు పాల్గొనేలా చర్యలు తీసుకో వాలని సూచించారు. పథకం వల్ల కలిగే ప్రయోజనాలను లబ్ధిదారులకు తెలియజేసి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసేలా చూడాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ కల్యాణచక్రవర్తి పాల్గొన్నారు.

పక్కుడుభద్రలో ఏనుగులు

భామిని: మండలంలోని పక్కుడుభద్రలో ఆరు ఏనుగుల గుంపు సంచరిస్తోంది. కాట్రగడ–బి వద్ద ఏబీ రోడ్డు పక్కన ఉన్న మొక్కజొన్న పంటను నాశనం చేశాయి. అనంతరం పక్కుడు భద్ర వద్ద జీడితోటల్లోకి చేరాయి. అటువైపుగా ఉపాధిహామీ పనుల కోసం వెళ్లిన వేతనదారులు ఏనుగులను చూసి పరుగుతీశారు.

సామూహిక కుంకుమపూజ

మెంటాడ: మండలంలోని చింతాడవలస గ్రామంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీరామమందిరంలో శుక్రవారం సామూహిక కుంకుమపూజ నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు శ్యామ్‌సుందర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గేదెల అన్నపూర్ణ భక్తులకు పూజా సామగ్రిని సమకూర్చారు.




 

Read also in:
Back to Top