సువర్ణావకాశం

స్కిల్‌ హబ్‌లలో శిక్షణ పొందుతున్న యువత  - Sakshi

మన్యం యువతకు
● గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాతో ఏడు ఏంఓయూలు ● జిల్లాలో 4 స్కిల్‌ హబ్‌ల నిర్వహణ ● గుమ్మలక్ష్మీపురంలో ఆర్‌అండ్‌ ఏసీ ఎస్టాబ్లేషన్‌ ల్యాబ్‌ ● జిల్లాలో మరింత నిరుద్యోగ యువతకు ఉపాధి

పార్వతీపురంటౌన్‌:

పార్వతీపురం మన్యం జిల్లా నిరుద్యోగ యువత కు శుభవార్త. ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో భాగంగా జిల్లాలోని నిరుద్యోగ యువతకు వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో నాణ్యమైన శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏడు సంస్థలు జిల్లా అధికారులతో ఎంఓ యూ కదుర్చుకున్నాయి. ఇప్పటికే జిల్లాలో నిర్వహిస్తున్న నాలుగు నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో యువత కు మెరుగైన శిక్షణ ఇస్తాయి. వివిధ కంపెనీల అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను తీర్చిదిద్దుతాయి. దీనివల్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ ఆశయం నెరవేరుతుంది. ఏజెన్సీ ప్రాంత యువతకు మంచి ఉద్యోగావకా శాలు లభిస్తాయని జిల్లా అధి కారులు చెబుతున్నారు.

ఎంఓయూలు ఇలా..

స్కిల్‌ హబ్‌లలోని యువతకు మరింత మెరుగైన శిక్షణ అందిచేందుకు శ్రీరంగామోటార్స్‌, నోవిసింక్‌ సోల్యూషన్స్‌ ఇండియా ప్రైవేట్‌లిమిటెడ్‌, జయభేరి ఆటోమోటివ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, శ్రీ జగదీశ్వరి ఎంట ర్‌ ప్రైజెస్‌, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, భరత్‌ ఎంటర్‌ ప్రైజెస్‌, మదర్‌ అండ్‌ ఫాద ర్‌ హోమ్‌ నర్సింగ్‌ సర్వీసెస్‌ సంస్థలు జిల్లా అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నాయి.

శిక్షణతో పాటు ఉద్యోగం

యువతలో నైపుణ్యాలను మెరుగుపరచి ఉపాధికి బాటలు వేసేందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ కృషి చేస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వ తీపురం, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట, సాలూరు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఏర్పాటుచేసిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో యువతకు వివిధ ఉద్యోగ కోర్సుల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. 18 నుంచి 28 ఏళ్ల వయస్సులోపు యువతకు మూడు నెలలపాటు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది.

గడిచిన ఐదు నెలల్లో జిల్లాలోని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వరంలో 13 మల్టీ నేషనల్‌ కంపెనీలు నిర్వహించిన జాబ్‌ మేళాల్లో 735 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు నేర నియంత్రణ ప్రేరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన జాబేళాలో 850 మంది నిరుద్యోగ యువత ఉద్యోగాలు పొందారు. జిల్లాకు చెందిన సుమారు 1600 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభించడంలో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక యువతకు చక్కని ఉద్యోగ భవిష్యత్‌ లభిస్తోందని, దీనివల్ల ఆయా కుటుంబాలు ఆర్థికోన్నతి చెందుతున్నాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.




 

Read also in:
Back to Top