పిల్లలు, గర్భిణులకు ‘సంపూర్ణ పోషణ’

పార్వతీపురం: వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కింద సరఫరా చేస్తున్న పౌష్టికాహారాన్ని పిల్లలు, గర్భిణులకు అంగన్‌వాడీ కేంద్రాల్లోనే వడ్డించాలని కలెక్టర్‌ నిషాంత్‌ కుమార్‌ ఆదేశించారు. మహిళా శిశుసంక్షేమశాఖ ప్రాజెక్టు అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రక్తహీనతతో బాధపడుతున్న వారి సంఖ్య తగ్గించేందుకు అంగన్‌వాడీ కేంద్రాలు కీలకభూమిక పోషించాలన్నారు. సీతంపేట, కురుపాం, భద్రగిరి, పార్వతీపురం ప్రాజెక్టు పరిధి లో పిల్లలు, గర్భిణుల హాజరు తక్కువుగా ఉందని, దీనిపై దృష్టిసారించాలని సూచించారు. పునరుత్ప త్తి, చిన్నారుల ఆరోగ్య గుర్తింపుకార్డు (ఆర్‌సీహెచ్‌ ఐడీ) మ్యాపింగ్‌ ప్రక్రియను ఈ నెల 25 నాటికి పూర్తి చేయాలన్నారు. ఆరేళ్లలోపు వయస్సు గల పిల్లల ఆధార్‌కార్డులను శనివారం నాటికి అప్‌డేట్‌ చేయాలని సూచించారు. వీడియో కాన్ఫిరెన్స్‌లో ఐసీడీఎస్‌ పీడీ కె.విజయగౌరి పాల్గొన్నారు.

సూక్ష్మసేద్యం రైతుకు బాగు

జామి: సూక్ష్మసేద్యం రైతుకు లాభదాయకమని, తక్కువ నీరు, పెట్టుబడితో అధిక విస్తీర్ణంలో పంట లు సాగుచేయవచ్చని ఏపీఎంఐపీ (ఆంధ్రప్రదేశ్‌ మైక్రో ఇరిగేషన్‌) పీడీ పీఎన్‌వీ లక్ష్మీనారయణ తెలిపారు. మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెంది న జి.లక్ష్మి, కొల్లు సత్యం తదితర రైతులు ఏర్పాటుచేసిన బిందు, తుంపర సేద్యం యూనిట్లను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు 752.95 హెక్లార్లలో బిందు, తుంపర సేద్యం సాగుకు అవసరమైన యూనిట్లు మంజూరైనట్టు వెల్లడించారు. ప్రభుత్వం సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం రాయితీపై యూని ట్లు సమకూర్చుతోందన్నారు. ఐదు ఎకరాల విస్తీర్ణం పైబడిన రైతులకు 55 శాతం రాయితీపై యూనిట్లు మంజూరు చేస్తున్నట్టు వెల్లడించారు. మామిడి, జీడిమామిడి, కొబ్బరి, ఆయిల్‌పాం, సపోట, జామ, చెరకు, కూరగాయల పంటలను సూక్ష్మసేద్యంలో సాగుచేయాలని సూచించారు.




 

Read also in:
Back to Top