
ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా కృషి చేస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలో నాలుగు స్కిల్ హబ్‌ల ద్వారా శిక్షణ అందజేస్తున్నాం. స్కిల్ హబ్‌లను మరింత అభివృద్ధి పథంలో తీసుకువచ్చేందుకు గ్లోబెల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఏడు కంపెనీలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ఏడాదికి 500 మందికి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాం. నిరుద్యోగ యువత అంతా సమీప స్కిల్‌హబ్ సెంటర్లలో తమ వివరాలు నమోదు చేసుకుని శిక్షణ పొంది ఉద్యోగ అవకాశాలు పొందాలి. చిత్తశుద్ధితో విధులు నిర్వహించి ఉద్యోగాల్లో రాణించాలి.
– మనోజ్‌కుమార్, ప్లేస్‌మెంట్ అధికారి,
పార్వతీపురం మన్యం