కళాకారులకు ఆహ్వానం

మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న 
పోలీసులు - Sakshi

రాజాం: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ స్థానిక తృప్తిరిసార్ట్‌లో ఈనెల 25, 26 తేదీల్లో ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నట్లు రిసార్ట్‌ ఎం.డి పీవీజీ కృష్ణ(మురళీమాస్టార్‌) శుక్రవారం తెలిపారు. 1971వ సంవత్సరం నేపథ్యంలోని వృత్తాంతంతో పిరియాడ సినిమా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులు మినహా మిగిలిన పాత్రలన్నింటికీ స్థానిక ఉత్తరాంధ్ర కళాకారులను తీసుకుంటున్నట్లు వివరించారు. 200 మందికి పైగా కళాకారులను ఈ సినిమాకు ఎంపికచేయనున్నట్లు తెలిపారు. కోవిడ్‌ తరువాత రిసార్ట్‌లో 12 కి పైగా సినిమాలు షూటింగ్‌ జరిగినట్లు చెప్పారు. గతంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ కార్తికేయ–2, ధమాకా వంటి సినిమాలు నిర్మించిందన్నారు. అటువంటి సంస్థ ఈ రిసార్ట్‌లో ఆడిషన్స్‌ చేయడం, ఈ ప్రాంత కళాకారులకు అవకాశం కల్పించడం ఆనందించదగ్గ విషయమని వివరించారు. ఆసక్తి ఉన్న కళాకారులు ఈనెల 25, 26 తేదీల్లో రిసార్ట్‌లో జరిగే ఆడిషన్స్‌కు హాజరుకావాలని సూచించారు.

61 మద్యం సీసాలు స్వాధీనం

కొత్తవలస: మండలంలోని వీరభద్రపురం గ్రామంలో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న మద్యం బెల్టుషాపుపై ఎస్సై బొడ్డు దేవి తన సిబ్బందితో శుక్రవారం దాడి చేసి మద్యం విక్రయిస్తున్న కె.సంతోష్‌ను అదుపులోకి తీసుకొని 61 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దేవి తెలిపారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.




 

Read also in:
Back to Top