విద్యార్థిని అదృశ్యంపై దర్యాప్తు

దర్యాప్తు చేస్తున్న బాలికా సంరక్షణ అధికారి రోజారమణి - Sakshi

గరుగుబిల్లి: మండలంలోని రావివలస కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని అదృశ్యంపై డీఈఓ ఎస్‌డీవీ రమణ దర్యాప్తుకు ఆదేశించారు. ఈ మేరకు జిల్లా అదనపు బాలికా సంరక్షణ అధికారి కె.రోజారమణి శుక్రవారం కేజీబీవీ పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్‌ ఎన్‌.ఛాయాదేవినుంచి సమాచారం సేకరించారు. విద్యార్ధిని ప్రవర్తన, పాఠశాలలో సిబ్బంది వ్యవహరించిన తీరు తదితర అంశాలపై తెలుసుకున్నారు. అనంతరం బాలిలా సంరక్షణ అధికారి మాట్లాడుతూ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నైట్‌వాచ్‌ఉమన్‌ జ్యోతిపై సస్పెన్షన్‌ వేటు వేయడంతో పాటు ప్రిన్సిపాల్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని చెప్పారు.

అదృశ్యంపై కేసు నమోదు

పాఠశాల విద్యార్థిని అదృశ్యంపై ప్రిన్సిపాల్‌ ఛాయాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.రాజేష్‌ తెలిపారు.




 

Read also in:
Back to Top