
సీతారామస్వామిని పల్లకిలో తీసుకువస్తున్న భక్తులు
నెల్లిమర్ల రూరల్:
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ సేవ శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. అర్చకులు వేకువ జామున స్వామికి ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో ప్రత్యేక హోమాలు జరిపించారు. అనంతరం స్వామి వెండి మంటపం వద్ద నిత్య పూజలు కొనసాగించారు. సాయంత్రం సీతారామచంద్రస్వామిని నూతన పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించి తూర్పు రాజగోపురం వద్దనున్న ప్రాంగణ వేదికపై ప్రత్యేక ఊయలలో ఆశీనులను చేశారు. అనంతరం దీపాలంకరణ వేడుక ప్రారంభించారు. వేద మంత్రోచ్చారణ నడుమ ప్రత్యేక ఊయలలో స్వామి వారిని వేంచేపు చేసి ఊంజల్ సేవ జరిపించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

స్వామి సన్నిధిలో దీపాలను వెలిగిస్తున్న భక్తులు