
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి.జన్నాథ రావు
● డీఎంహెచ్‌ఓ బి.జగన్నాథ రావు
పార్వతీపుంటౌన్: ఆరోగ్య కార్యక్రమాలు ప్రజల చెంతకు చేరాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి.జగన్నాథ రావు ఆదేశించారు. ఆరోగ్య కార్యక్రమాలు, సంబంధిత యాప్‌లపై వైద్యాధికారులకు శుక్రవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమం, సంబంధిత వైద్యసేవలు ప్రజలకు అందాలని సూచించారు. అందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుం దన్నారు. ఆరోగ్య యాప్‌లలో రోగుల వివరాలు నమోదు చేయాలని కోరారు.
మాతృ మరణాలపై సమీక్ష
2022 నవంబరు నుంచి 2023 జనవరి వరకు జరిగిన మూడు మాతృ మరణాలపై డీఎంహెచ్‌ఓ సమీక్ష నిర్వహించారు. తాడికొండ పీహెచ్‌సీ పరిధి పెదఖర్జ, జియ్యమ్మవలస పీహెచ్‌సీ పరిధి బాసంగి, సీతంపేట మండలం మర్రిపాడు పీహెచ్‌సీ పరిధి రేగులగూడలో మరణాలు సంభవించాయన్నారు. హైరిస్క్ గర్భిణులను ముందుగా గుర్తించి చక్కని ప్రణాళికతో ప్రసవానికి ముందుగానే ఆస్పత్రిలో చేర్చడం, సీ్త్ర వైద్య నిపుణులతో పరీక్షలు విధిగా జరగాలని ఆయన ఆదేశించారు. గర్భిణుల ఆరోగ్యం నిరంతరం పర్యవేక్షించాలని ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలను ఆదేశించారు. వైద్య సేవలు అందించడంలో ఉన్న సంతృప్తిని ప్రతి ఒక్కరూ పొందాలని కోరారు. సమావేశంలో డీఐఓ జగన్మోహనరావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె.విజయ పార్వతి, ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ జి.వెంకటరమణ, గైనకాలజిస్ట్ డాక్టర్ బి.కమల కుమారి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ జగన్‌మోహన్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఎం.వినోద్, వైద్యాధికారులు, పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.
8 మంది డీబార్
విజయనగరం ఫూల్‌బాగ్: ఇంటర్‌మీడియట్ ద్వితీయ సంవత్సరం (మ్యాఽథ్స్–2బి, జువాలజీ–2, హిస్టరీ–2పేపర్) పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 24,795 మంది విద్యార్ధులు హాజరయ్యారు. వారిలో మాల్‌ప్రాక్టీసుకు పాల్పడిన 8 మంది విద్యార్థులను డీబార్ చేసినట్లు ఆర్‌ఐఓ ఎం.సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. ఇంటర్‌మీడియట్ జనరల్ పరీక్షకు 20206 మంది హాజరు కావాల్సి ఉండగా, 19484 మంది హాజరయ్యారు. ఒకేషనల్ పరీక్షకు 4589 మంది హాజరు కావాల్సి ఉండగా, 4295 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆర్‌ఐఓ మూడు పరీక్షా కేంద్రాలను, డీఈసీ మూడు కేంద్రాలను తనిఖీ చేశారు. స్క్వాడ్ బృందాలు 42, ఇతర అధికారులు 8 కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు.