గడప గపడకు పనులకు చెల్లింపులు

కుక్కల దాడిలో మరణించిన మేకలు  - Sakshi

పార్వతీపురం: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పూర్తిచేసిన పనులకు వెంటనే చెల్లింపులు జరుగుతున్నాయని పీఆర్‌ ఇంజినీరింగ్‌ అధికారి ఎంవీఆర్‌ కృష్ణాజీ తెలిపారు. ఈ మేరకు పీఆర్‌ ఇంజినీరింగ్‌ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలోని 15 మండలాల్లో గడప గడపకు మన ప్రభుత్వం నిధుల నుంచి గ్రామస్థాయిలో పనులు మంజూరు జరిగాయని, ఇంతవరకు జిల్లాలో 814 పనులకు రూ.19.08 కోట్లతో పరిపాలన, సాంకేతిక పరమైన ఆమోదాలు వచ్చినట్లు చెప్పారు. ఆ పనులకు గాను 667 మంది కాంట్రాక్టర్లను నియమించామన్నారు. 30 పనులకు టెండర్లు పూర్తయ్యాయని, కొన్ని పనులను నామినేషన్‌ పద్ధతిలో అప్పగించామని చెప్పారు. గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు వారి గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం నిధులతో మంజూరైన సీసీ రోడ్లు, కాలువలు, రహదారులు వెంటనే పనులు పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు.

గిరిజన రైతు ఆత్మహత్య

పాచిపెంట: మండలంలోని కేరంగి పంచాయతీ కొండమోసూరులో పురుగు మందుతాగి గిరిజన రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గత ఏడాది వర్షాల కారణంగా గ్రామానికి చెందిన గిరిజన రైతు సోములు బోడియ్య జీడిమామిడి పంటకు నష్టం వాటిల్లింది. దీంతో అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురై మద్యానికి బానిసయ్యాడు, మద్యం మత్తులో గురువారం ఉదయం పొలానికి వెళ్లి పురుగుమందు తాగాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య, కుటుంబసభ్యులు సాలూరు సీహెచ్‌సీకి తీసుకువెళ్లగా పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందాడు.

మేకల మందపై కుక్కల దాడి

ఎనిమిది పిల్లల మృతి

పాలకొండ:

ట్టణంలోని ఏలాం ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున కుక్కల గుంపు దాడి చేయడంతో ఎనిమిది మేకపిల్లలు మృతిచెందాయి. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మేకల పెంపకం దారు జోలయ్య గురువారం రాత్రి తల్లి మేకలను ఒక చోట ఉంచి పిల్లలను వేరే పాకలో ఉంచారు. అర్ధరాత్రి దాటిన తరువాత కుక్కల గుంపు పిల్లలు ఉన్న పాకలోనికి చొరబడి వాటిని వెంటాడి ముక్కలు ముక్కలుగా చేశాయి. ఇంతలో వాటి అరుపులు విని వెళ్లిన జోలయ్య కుక్కల గుంపును తరిమేందుకుకు ప్రయత్నించగా ఆయనపై కూడా దాడిచేశాయి. దీంతో చుట్టుపక్కల వారిని పిలిచి కుక్కలను తరిమారు. అప్పటికే ఎనిమిది మేక పిల్లలు మృతిచెందగా మరి కొన్ని గాయాలపాలయ్యాయి. వాటికి స్థానిక పశువైద్య కేంద్రంలో చికిత్స చేశారు.




 

Read also in:
Back to Top