పాఠశాలల నిర్వహణ నిధుల విడుదలకు వినతి | - | Sakshi
Sakshi News home page

పాఠశాలల నిర్వహణ నిధుల విడుదలకు వినతి

Mar 24 2023 5:58 AM | Updated on Mar 24 2023 5:58 AM

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, 
ఇతర అధికారులు  - Sakshi

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, ఇతర అధికారులు

పార్వతీపురం: పాఠశాల నిర్వహణ నిధులు విడుదల చేయాలని కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డిని కోరా రు. కలెక్టర్లతో గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కొన్ని పాఠశాలలకు పాఠశాల నిర్వహణ నిధులు విడుదల చేయా ల్సి ఉందని, వాటిని విడుదల చేయాలని కోరగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందిస్తూ విడుదల చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రక్తహీనతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, మెరుగు పరుచుటకు కలెక్టర్లు చర్య లు తీసుకోవాలన్నారు. గృహ నిర్మాణాలకు మౌలిక సదుపాయాలు కల్పన చేయాలని సూచించారు. పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించా లని ఆదేశించారు. స్పందన కార్యక్రమం సంతృప్తి మేరకు ఉండాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సంయుక్త కలెక్టర్‌ ఓ.ఆనంద్‌, పార్వతీపురం ఐటీడీఏ పీఓ సి.విష్ణుచరణ్‌, జిల్లా రెవెన్యూ అఽధికారి జె.వెంక టరావు, జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యా అధికారి డి. మంజులవీణ, జిల్లా పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారి డాక్టర్‌ ఎం.వి.ఆర్‌ కృష్ణాజి, డీఈఓ డాక్టర్‌ ఎస్‌.డి.వి.రమణ, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె.విజయగౌరి, జిల్లా ప్రణాళిక అధికారి పి. వీరరాజు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కలెక్టర్‌ విన్నపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement