మహిళలకు ఆసరా

పార్వతీపురం మండలంలో బ్యాంకు లింకేజీ రుణాలకు మహిళల వేలిముద్రలను సేకరిస్తున్న సిబ్బంది  - Sakshi

● మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి ● సంక్షేమ పథకాలతో ఆర్థిక అండ ● ఆర్థికాభివృద్ధి దిశగా మహిళామణులు ● రూ.947.94 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు ● సున్నా వడ్డీ పథకం ద్వారా రూ.30.50 కోట్ల మేర వడ్డీ రాయితీ ● వైఎస్సార్‌ ఆసరా మూడో విడత నగదు జమ రేపు ● ఆసరాతో రూ.157.84 కోట్ల మేర ప్రయోజనం

మహిళలకు పెద్దపీట

మహిళలకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి జగనన్న రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. మహిళలందరినీ ముఖ్య మంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఓ అన్నలా ఆదుకుంటున్నారు. స్వయం సహాయక బృందంలో చేరి బ్యాంకు నుంచి రూ.35 వేల రుణం పొందాను. టైలరింగ్‌ పని ప్రారంభించాను. రూ.2 వేలు నావంతు పెట్టుబడిగా పెట్టాను. వ్యాపారం ఆశాజనకంగా నడుస్తోంది. సకాలంలో రుణం చెల్లిస్తున్నాను. ప్రస్తుతం నెలకు రూ.6వేల నుంచి రూ.8 వేల వరకు సంపాదిస్తున్నాను. సున్నా వడ్డీ రాయితీ వర్తిస్తోంది.

–చుక్క పద్మ, పెద్దబోండపల్లి, పార్వతీపురం

మహిళల ఆర్థికాభివృద్ధితో పాటు సాధికారతకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తన వంతు

కృషి చేస్తోంది. ఇందు కోసం అనేక పథకాలు మహిళలకే వర్తించేలా తెచ్చి పక్కాగా అమలు చేస్తోంది. దీంతో జిల్లాలో మహిళలు స్వయం శక్తిపై ఎదుగుతూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

పార్వతీపురం టౌన్‌:

రాష్ట్రంలో మహిళల ఆర్థిక సాధికారతకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగానే వారి సంక్షేమానికి పలు పథకాలు ప్రవేశపెట్టి వారి ఆర్థికాభివృద్ధికి పాటు పడుతోంది. అదే సమయంలో మహిళలు కూడా ఈ సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కుటీర పరిశ్రమలు, కిరా ణ దుకాణాలు, డెయిరీ ఫాంలు నిర్వహిస్తూ ఆర్థికో న్నతి చెందుతున్నారు. నవరత్నాలు అమలులో ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోంది. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా తదితర పథకాలతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తోంది. రుణాలను బ్యాంకుల నుంచి విరివిగా మంజూరు చేయిస్తోంది. మూడున్నరేళ్లుగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మహిళల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్న పథకాల లబ్ధితో జీవన ఉన్నతికి బాటలు వేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో మొత్తం 19,528 స్వయం సహాయ క సంఘాల్లోని 2,25,667 మంది మహిళలకు బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం అందుతోంది.

రూ.947.94 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు

రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా, దీనికి బ్యాంకులు తోడ్పాటు అందిస్తున్నాయి. బ్యాంకు లింకేజీ ద్వారా 2022 – 23 ఆర్థిక సంవత్సరానికి ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి స్వయం సహాయక సంఘాల పరిధిలో ఉన్న 2,60,500 మంది లబ్ధిదారులకు రుణ పంపిణీ లక్ష్యం కాగా, 2,48,419 మంది మహిళలకు రూ.947.94 కోట్లమేర రుణాలను నేరుగా వారి గ్రూపు ఖాతాల్లో జమ చేశారు. సీ్త్రనిధి పథకం కింద 16,496 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణ పంపిణీ లక్ష్యం కాగా 15,200 మందికి రూ.2.20 కోట్లు అందించారు.

ఆసరాతో రూ.157.84 కోట్ల ప్రయోజనం

జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 15 మండలాల్లో తొలి విడతలో 14,271 సంఘాలకు సుమారు రూ.78.18 కోట్లు, రెండో విడతలో 14,383 సంఘాలకు రూ.79.65 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. మూడో విడతగా 14,302 సంఘాల్లో 1,65,089 మందికి లబ్ధి చేకూర్చనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 25వ తేదీన ఆసరా నగదు అందించేందుకు చర్యలు చేపట్టారు.




 

Read also in:
Back to Top