రేపు జిల్లాస్థాయి వెటర్న్‌ క్రీడా పోటీలు | - | Sakshi
Sakshi News home page

రేపు జిల్లాస్థాయి వెటర్న్‌ క్రీడా పోటీలు

Nov 29 2025 7:33 AM | Updated on Nov 29 2025 7:33 AM

రేపు

రేపు జిల్లాస్థాయి వెటర్న్‌ క్రీడా పోటీలు

గుంటూరువెస్ట్‌(క్రీడలు): జిల్లాస్థాయిలో క్రీడా పోటీలను ఆదివారం స్థానిక ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించనున్నట్లు వెటరన్‌ అథ్లెటిక్‌ అసోసియేషన్‌ గుంటూరు జిల్లా అధ్యక్షులు మాదల చైతన్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 30 నుంచి 90 ఏళ్ల వయసు మధ్య మహిళలకు, పురుషులకు పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వాకింగ్‌, త్రో, రన్నింగ్‌, జంపింగ్‌ తదితర పోటీలను మహిళలకు, పురుషులకు విభాగాల వారీగా వేర్వేరుగా జరుగుతాయని చెప్పారు. జిల్లా స్థాయిలో ఆయా విభాగాల్లో ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయి వెటరన్‌ పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. పోటీల వివరాలను 9000979056, 9949526697లో సంప్రదించాలని కోరారు. దీనికి సంబంధించిన క్రీడా పోస్టర్‌ను అసోసియేషన్‌ సెక్రెటరీ జి.రాంబాబు, వైస్‌ ప్రెసిడెంట్‌ విజయ్‌ కిరణ్‌, ఈసీ మెంబర్‌ జి.గోపీనాథ్‌, ట్రెజరర్‌ సత్యనారాయణ ఎన్టీఆర్‌ స్టేడియంలో విడుదల చేస్తామన్నారు.

పశ్చిమ డెల్టాకు 3,225 క్యూసెక్కులు విడుదల

దుగ్గిరాల: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి పశ్చిమడెల్టాకు 3,225 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగుల నీటి మట్టం ఉంది. దుగ్గిరాల సబ్‌ డివిజన్‌ హైలెవల్‌కు 196 క్యూసెక్కులు, బ్యాంక్‌ కెనాల్‌కు 338 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 84, నిజాంపట్నం కాలువకు 86, కొమ్మూరు కాలువకు 1,891క్యూసెక్కులు విడుదల చేశారు.

జాతీయ స్థాయి సైక్లింగ్‌ పోటీలకు

ఐదుగురు ఎంపిక

తూములూరు(కొల్లిపర): ఆంధ్రప్రదేశ్‌ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో విజయవాడ జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల నున్నలో అండర్‌– 19, 14 విభాగాలల్లో తూములూరులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి సైక్లింగ్‌ పోటీల్లో పతకాలు సాధించి జాతీయ స్థాయి సైక్లింగ్‌ పోటీలకు అర్హత సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.నాగలక్ష్మి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్ధులకు పాఠశాలలో పీడీ ఎస్‌.సాంబశివరావు, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్‌, ఉపాధ్యాయులు అభినందించారు.

పోలీస్‌ సిబ్బంది సమస్యలు

ఎప్పటికప్పుడు పరిష్కారం

నగరంపాలెం (గుంటూరు వెస్ట్‌) : పోలీస్‌ శాఖలో విధులు నిర్వర్తించే పోలీస్‌ సిబ్బంది సమస్యలకు నిర్ణీత వేళల్లో పరిష్కారం చూపుతామని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్‌ కార్యాలయం (డీపీఓ) శుక్రవారం పోలీస్‌ సిబ్బంది గ్రీవెన్‌న్స్‌ డే నిర్వహించారు. వ్యక్తిగత, సర్వీస్‌, బదిలీలు, పరిపాలనా సమస్యలపై వినతులు అందించారు. పదిహేను మంది వినతులు అందించగా, వారి సమస్యలను జిల్లా ఎస్పీ అలకించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదు నిర్ణీత వేళలో పరిష్కారమయ్యేలా దృష్టి సారించాలని సూచించారు. పోలీస్‌ సిబ్బంది సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు.

రేపు  జిల్లాస్థాయి వెటర్న్‌ క్రీడా పోటీలు 1
1/2

రేపు జిల్లాస్థాయి వెటర్న్‌ క్రీడా పోటీలు

రేపు  జిల్లాస్థాయి వెటర్న్‌ క్రీడా పోటీలు 2
2/2

రేపు జిల్లాస్థాయి వెటర్న్‌ క్రీడా పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement