తుఫాన్ వచ్చి నెల దాటుతున్నా ఆదుకోని ప్రభుత్వం
నేను ఐదు ఎకరాలు పొలం కౌలుకు తీసుకొని వరి సాగు చేశా. సుమారు రూ. 1.70 లక్షలకు పైన పెట్టుబడి పెట్టా. ఎకరాకు 35 బస్తాలు చొప్పున 175 బస్తాలు దిగుబడి వస్తుందని ఆశించా. పంట కీలక సమయంలో మోంథా తుఫాన్ కోలుకోలేని దెబ్బతీసింది. ప్రస్తుతం ఎకరానికి 25 బస్తాలు మించి దిగుబడి వచ్చేలా కనిపించడం లేదు. తుఫాన్ వచ్చి నెల రోజులవుతున్నా ప్రభుత్వం నేటికీ పరిహారం అందించలేదు. దీనికి తోడు అన్నదాత సుఖీభవ పథకం గత ఏడాది కానీ, ఈ ఏడాది కానీ అందించలేదు.
– కొత్తపల్లి యోహాన్, కౌలు రైతు, చేజర్ల
●


