అర్జీలను సత్వరం పరిష్కరించండి
నరసరావుపేట: ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేకంగా కలెక్టరేట్‌లో శనివారం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధ్యక్షతన నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో 11 అర్జీలు స్వీకరించారు. వాటిని సత్వరంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
మట్టి అక్రమ తవ్వకాలు నిలిపివేయండి
హైకోర్టు స్టేటస్‌కో ఉన్న సర్వే నెంబరు భూమిలో టీడీపీ నాయకులు మట్టి అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. అదేమని అడిగిన వారిని పోలీసుల అండదండలతో కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోండి.
–గ్రామ దళితులు, మురికిపూడి, చిలకలూరిపేట మండలం
పీఎం ఈజీపీ రుణాలు మంజూరు చేయండి
ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీ కింద పీఎం ఈజీపీ రుణాలు వెంటనే మంజూరు చేయాలి. మూడేళ్ల నుంచి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అమలు కాలేదు. రుణాలు అందక వడ్డీదారుల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. సిబిల్‌స్కోరు, ఒకరికి ఒకరు ష్యూరిటీ లేకుండా వెంటనే ఇవ్వాలి. –మీరయ్యమాదిగ,
ఎంఆర్‌పీఎస్‌ఎస్ నాయకులు


