సూర్యలంకలోని హరిత రిసార్ట్స్‌ను అభివృద్ధి చేస్తాం
బాపట్ల: సూర్యలంకలోని హరిత రిసార్ట్స్‌ను ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ శనివారం పరిశీలించారు. రిసార్ట్స్‌లో లభ్యమయ్యే వసతి సదుపాయా లు, బీచ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సౌకర్యా లు, పర్యాటకులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఆయన సూర్యలంకను ఆకర్షణీయమై న పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. రిసార్ట్స్ సౌకర్యాల విస్తరణ, భద్రతా ఏర్పాట్ల మెరుగుదల, పర్యాటకులను ఆకట్టుకునే ప్రత్యే క ప్యాకేజీల రూపకల్పనపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. వారాంతాలు, సెలవుదినాల్లో పెరిగే పర్యాటక రద్దీ దృష్ట్యా సేవల నాణ్యత, పరిశుభ్రత, జనసంచారం నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పేర్కొన్నా రు. కార్యక్రమంలో టూరిజం శాఖ అధికారు లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
టోల్ వసూలుపై అసంతృప్తి
సూర్యలంక వెళ్తున్న చైర్మన్ వాహనాన్ని టోల్ వసూలు పేరుతో నిలిపివేయడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. టూరిజం ప్రాంతానికి వచ్చే వాహ నాలపై టోల్ వసూలు చేయడం సరికా దని, ఈ అంశంపై కలెక్టర్‌తో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. పంచా యతీ సిబ్బంది టోల్ వసూలు చేస్తున్నారన్న విషయంపై ఎలా వసూలు చేస్తున్నారు, దానికి ఆధారం ఏమిటో తెలుసుకోవాలన్నారు.


