బాల్య వివాహాలతో అనర్థాలు
బెల్లంకొండ: బాల్య వివాహాలు చేయడం ద్వారా ఎన్నో అనర్థాలను ఎదుర్కోవాల్సి వస్తుందని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శౌరిరాజు పేర్కొన్నారు. శుక్రవారం బెల్లంకొండలో గ్రామస్థాయి బాల్య వివాహాల నిరోధక, పర్యవేక్షణ కమిటీ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బాల్యవివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని, వాటి వలన కలిగే అనర్థాలను ప్రతి ఒక్కరికి వివరించాలని సూచించారు. బాల్య వివాహాల ద్వారా మానసిక శారీరక ఎదుగుదల లేకపోవడం, మాతా శిశు మరణాలకు దారితీస్తుందని తెలిపారు. తల్లిదండ్రులు ఆడపిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అనంతరం గ్రామస్థాయి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. సమావేశంలో గ్రామ సర్పంచ్ గడిపర్తి జ్యోతి సముద్రం, పంచాయతీ కార్యదర్శి గిరిధర్‌రెడ్డి, ఏఎన్‌ఎం విజయలక్ష్మి, వీఆర్వో ముక్కంటి, అంగన్‌వాడీ పార్వతి, ఎన్జీవో సభ్యుడు దుగ్గి శామ్యూల్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శౌరిరాజు


