తాకట్టు బంగారం బాధితులకు పరిష్కారం
దొడ్లేరు(క్రోసూరు): రెండు సంవత్సరాల క్రితం దొడ్లేరు చైతన్యగోదావరి గ్రామీణ బ్యాంకు నందు ఖాతాదారులు తాకట్టు పెట్టుకున్న బంగారు ఆభరణాలు గోల్‌మాల్ కాగా విచారణ అనంతరం సమస్యను పరిష్కరించినట్లు బ్యాంకు రీజనల్ మేనేజర్ గురువారం తెలిపారు. 2023ఆగస్టులో బ్యాంకులో 505 మంది ఖాతాదారులకు చెందిన తాకట్టు బంగారు ఆభరణాలలో అవతవకలు జరిగాయి. బాధితులు అనేకమార్లు బ్యాంకు ఎదుట ఆందోళన చేయటం జరిగింది. దీనిపై సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు, క్రోసూరు సీఐ సురేష్, ఎస్‌ఐ రవిబాబు గోల్‌మాల్ అయిన ఆభరణాల విషయంలో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 505 మంది ఖాతాదారులకు సంబంధించిన ఆభరాణాలపై విచారణ చేపట్టిన ప్రక్రియలో గత ఏడాది 401 మంది బాధితులందరికీ రూ.2.5 కోట్లు పరిష్కరించినట్లు బ్యాకు రీజనల్ మేనేజరు పి.సుభాష్, బ్యాంకు మేనేజరు శివశంకర్ నాయక్ వివరించారు. అదేవిధంగా మరో 104 మంది ఖాతాదారులకు రూ.కోటి రూపాయలు చెల్లించి సమస్య గురువారం పరిష్కరించినట్లు తెలిపారు. మొత్తం 505 మంది ఖాతాదారులకు రూ.3.5 కోట్లు బ్యాంకు అందచేసి పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు.
బ్యాంకులో లావాదేవీలు జరగని ఖాతాదారులకు...
ఈ సందర్భంగా రీజనల్ మేనేజరు విలేకరులతో మాట్లాడుతూ ఆర్బీఐ ఆదేశాల మేరకు తమ బ్యాంకు లో గత పది సంవత్సరాలు గా 1818 ఖాతాదారులకు చెందిన నగదు రూ.23 లక్షలు ఉండిపోయాయన్నారు. వారు లేదా వారి వారసులు వచ్చి తమ జాబితా చూసుకుని వారి నగదు తీసుకెళ్లాలని కోరారు.


