బాస్కెట్‌ బాల్‌ జిల్లా జట్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

బాస్కెట్‌ బాల్‌ జిల్లా జట్ల ఎంపిక

Oct 22 2025 7:10 AM | Updated on Oct 22 2025 7:10 AM

బాస్క

బాస్కెట్‌ బాల్‌ జిల్లా జట్ల ఎంపిక

చిలకలూరిపేట: ఉమ్మడి గుంటూరు జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ బాస్కెట్‌ బాల్‌ జట్ల ఎంపిక పట్టణంలోని ఏఎంజీ హైస్కూల్‌ క్రీడా ప్రాంగణంలో మంగళవారం నిర్వహించారు. బాలురు, బాలికలకు విడివిడిగా అండర్‌–14, అండర్‌–17 విభాగాలలో ఉమ్మడి జిల్లా జట్లకు ఎంపిక చేశారు. ఈ ఎంపిక కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా స్కూల్‌ గేమ్స్‌ మహిళా కార్యదర్శి డాక్టర్‌ పద్మావతి, ఏఎంజీ హై స్కూల్‌ హెచ్‌ఎం కె.కృపాదానం ప్రారంభించారు. ఈ పోటీలలో ఉమ్మడి జిల్లా పరిధిలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల నుంచి 160 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా అండర్‌– 14కి ఎంపికై న క్రీడాకారులు నవంబర్‌ ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు. అండర్‌–17కి ఎంపికై న క్రీడాకారులు కృష్ణాజిల్లా నూజివీడులో త్వరలో జరగబోవు రాష్ట్రస్థాయి పోటీలకు హాజరవుతారు.

ఎంపికై న క్రీడాకారుల వివరాలు

అండర్‌– 17 బాలుర జట్టు

వై బి స్‌ ఎం అఖిల్‌, పూండ్ల హైస్కూల్‌ బాపట్ల, బి ఈశ్వర్‌ సాయి వర్ధన్‌, యువ స్కూల్‌, గుంటూరు, టి.జాన్‌ రెడ్డి పాల్‌. శ్రీ చైతన్య హైస్కూల్‌, నరసరావుపేట, జి.జ్ఞాన విగ్నేశ్వర కార్తీక్‌,ఏఎంజీ హై స్కూల్‌, చిలకలూరిపేట, జి.పాల్‌ టోనీ ప్రత్యూషు, నారాయణ స్కూల్‌, గుంటూరు, జి.వంశీకృష్ణ, ఏఎంజీ హై స్కూల్‌ చిలకలూరిపేట, బి.అఖిల్‌, గుడ్‌ షెఫర్డ్‌ వినుకొండ, ఎన్‌ దుర్గా పవన్‌, ఆక్స్‌ఫర్డ్‌, గుంటూరు, బి.నిర్మలా జోసెఫ్‌, జడ్పీహెచ్‌ఎస్‌ మందపాడు, జె.లక్ష్మీ ప్రవీణ్‌ రాజు, ఆక్స్‌ఫర్డ్‌, పిడుగురాళ్ల, కె.ప్రభాకర్‌, వేద హై స్కూల్‌, చిలకలూరిపేట, కె.మణికంఠ, ఎస్‌.పి.ఎస్‌ గుంటూరు.

అండర్‌ 17 బాలికల జట్టు....

షేక్‌ ఫరహానా, వాగ్దేవి నరసరావుపేట, వై.యోగ శ్రీ, గీతాంజలి హైస్కూల్‌, గుంటూరు, ఎస్‌డి జుబేరియా జాస్మిన్‌, మున్సిపల్‌ గరల్స్‌ హైస్కూల్‌, నరసరావుపేట, కె.మానస, మున్సిపల్‌ గరల్స్‌ హై స్కూల్‌, నరసరావుపేట, డి.దివ్య, ఏఎంజీ హై స్కూల్‌, చిలకలూరిపేట, పీవీఎస్‌ శ్రీలక్ష్మి, మున్సిపల్‌ గరల్స్‌ హై స్కూల్‌, నరసరావుపేట, కె.ధన్య, ఏఐఎంఈ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, పాతూరు, ఎస్‌ఆర్‌ఎస్‌వీఎస్‌ఎన్‌ఎస్‌ లక్ష్మి, కేంద్రియ విద్యాలయ, సత్తెనపల్లి, సి.హెచ్‌.శ్యామ్‌ శరణ్య, ఏఎంజీ హై స్కూల్‌, చిలకలూరిపేట, ఎస్‌ సాయి శ్రీ, మున్సిపల్‌ గరల్స్‌ హై స్కూల్‌, నరసరావుపేట, ఎస్‌.సహస్ర, ఎల్‌.ఎఫ్‌.ఎల్‌ స్కూల్‌, గుంటూరు, బి.ధనలక్ష్మి మున్సిపల్‌ గరల్స్‌ హై స్కూల్‌, నరసరావుపేట.

అండర్‌ 14 బాలుర జట్టు

ఏ వెంకట నాగ శశాంక్‌, టి.షణ్ముఖరావు, ఎస్‌.ఎస్‌ రాంప్రతాప్‌, ఎస్‌ పి ఎస్‌ హై స్కూల్‌, గుంటూరు, సి.హెచ్‌ రిత్విక్‌ రెడ్డి, ఆక్స్‌ఫర్డ్‌ హైస్కూల్‌, గుంటూరు, ఎం.శ్రీ మణికంఠ, ఏఎంజీహై స్కూల్‌, చిలకలూరిపేట, జి.గురు విష్ణు, ఏఎంజీ హై స్కూల్‌, చిలకలూరిపేట, ఏ. రుద్ర, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌, గుంటూరు, వి.శివ, మున్సిపల్‌ బాయ్స్‌ హై స్కూల్‌, నరసరావుపేట, ఏ అరవింద్‌ బాబు, ఏఎంజీ హై స్కూల్‌, చిలకలూరిపేట, బి.వంశీ, ఎల్‌ఎఫ్‌ఎస్‌ స్కూల్‌, గుంటూరు, జి.సాగర్‌ బాబు, జడ్పీహెచ్‌ఎస్‌, మందపాడు, ఎల్‌. భాస్కర్‌ నాయక్‌ ఏఎంజీ హైస్కూల్‌, చిలకలూరిపేట.

అండర్‌ 14 బాలికల జట్టు...

ఎ.వెంకటలక్ష్మి అక్షయ, శ్రీపాటి బండ్ల సీతారామయ్య స్కూల్‌, గుంటూరు, కె. కావ్య, మున్సిపల్‌ గరల్స్‌ హై స్కూల్‌, నరసరావుపేట, కె.రిషిక, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌, గుంటూరు, టి.లాస్య రెడ్డి, ఏఎంజీ హై స్కూల్‌, చిలకలూరిపేట, ఎం.జాహ్నవి, గుడ్‌ షెఫర్డ్‌ స్కూల్‌, వినుకొండ, వి.మహిమ, జడ్పీహెచ్‌ఎస్‌, అంకిరెడ్డిపాలెం, డి.పవిత్ర, ఏఎంజీ హై స్కూల్‌, చిలకలూరిపేట, జి.హేమ హరిణి, జెడ్‌పి హెచ్‌.ఎస్‌, పేరేచర్ల, పి.సుమ బిందు, జి.జి.హెచ్‌.ఎస్‌. గుంటూరు, జి.ఉషశ్రీ, మున్సిపల్‌ గరల్స్‌ హై స్కూల్‌, నరసరావుపేట, పి. దీప్తి, జెడ్‌.పి.హెచ్‌ స్కూల్‌, అంకిరెడ్డిపాలెం, ఐ.షామిని, ఏఐఎంఈ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, పాతూరు.

బాస్కెట్‌ బాల్‌ జిల్లా జట్ల ఎంపిక 1
1/1

బాస్కెట్‌ బాల్‌ జిల్లా జట్ల ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement