అంగన్‌వాడీ కేంద్రాల్లో అవినీతిపై విచారణ | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ కేంద్రాల్లో అవినీతిపై విచారణ

May 31 2025 1:37 AM | Updated on May 31 2025 1:37 AM

అంగన్‌వాడీ కేంద్రాల్లో అవినీతిపై విచారణ

అంగన్‌వాడీ కేంద్రాల్లో అవినీతిపై విచారణ

వినుకొండ: అంగన్‌వాడీ ఈపూరు ప్రాజెక్టు అధికారి అరుణపై వచ్చిన అవినీతి ఆరోపణలపై జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ ఉమాదేవి శుక్రవారం విచారణ చేపట్టారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అనధికార వసూలుపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. ప్రతినెలా అంగన్‌వాడీ కార్యకర్తలు ఆయాలు మామూళ్లు ఇవ్వాలని, ఈనెల 31వ తేదీ రానున్న నేపథ్యంలో అందరూ తప్పనిసరిగా డబ్బులు ఇవ్వాలని సోషల్‌మీడియాలో ఓ కార్యకర్త పోస్టు పెట్టడంతో వివాదం నెలకొంది. బొల్లాపల్లి, ఈపూరు మండలాల అంగన్‌వాడీ కార్యకర్తలను వ్యక్తిగతంగా విచారణ చేసి వారి అభిప్రాయాలను లిఖితపూర్వకంగా నమోదు చేసినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నివేదికను జిల్లాకలెక్టరు కు నివేదించనున్నట్లు చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాలను నిబంధనల ప్రకారం నడపాలని సూచించారు. ఎక్కడయినా సమస్యలు ఉంటే తమదృష్టికి తీసుకురావాలని కోరారు.

ఈపూరులో విచారణ చేపట్టిన పీడీ

జిల్లా కలెక్టరుకు నివేదించనున్న వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement