ఆత్మరక్షణ కోసం ఆయుధం | - | Sakshi
Sakshi News home page

ఆత్మరక్షణ కోసం ఆయుధం

Jun 3 2025 5:51 AM | Updated on Jun 3 2025 5:51 AM

ఆత్మరక్షణ కోసం ఆయుధం

ఆత్మరక్షణ కోసం ఆయుధం

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): ప్రతి చిన్న సమస్యని పెద్దదిగా చూడడం, ఆందోళన చెందడం, క్రమశిక్షణ లోపించడం తదితర అంశాలను నేటిచిన్నారుల్లో తరచూ చూస్తుంటాం. తల్లిదండ్రుల్లో కూడా తమ పిల్లల చదువుకు అధిక ప్రాధాన్యతనిచ్చి పెద్ద కళాశాలల్లో సీట్లు సాధించాలనే తపన ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కొందరు మాత్రం తమ పిల్లల్ని విద్యావంతులుగానూ ఆత్మ రక్షణ విద్యలోనూ మేటిగానూ చూడాలనుకుంటున్నారు. దీనికి తగ్గట్లుగా శిక్షణా శిబిరాల్లో చేర్పించి దీటుగా తీర్చిదిద్దుతున్నారు. ఇలా శిక్షణ పొందిన కొందరు చిన్నారులు పోటీల్లోనూ రాణిస్తున్నారు. గుంటూరు విద్యానగర్‌లోని కాశీనాథ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ అకాడమీలో సుమారు 100 మందికిపైగా మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతూ అద్భుతంగా రాణిస్తున్నారు. గత నెల 24 నుంచి 26 వరకు తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జరిగిన 5వ అంతర్జాతీయ కర్రసాము పోటీల్లో 9 బంగారు, 5 రజతాలు 3 కాంస్య పతకాలు సాధించి ఔరా అనిపించారు. అకాడమీ కోచ్‌ కాశీనాథ్‌ రెడ్డి ప్రత్యేక శిక్షణలో రాటుదేలుతున్న వీరు కర్రసాముతోపాటు తైక్వాండాలోనూ విశేషంగా రాణిస్తున్నారు.

కర్రసాము, తైక్వాండోల్లో రాణిస్తున్న చిన్నారులు అంతర్జాతీయ పోటీల్లో పతకాల పంట మారుతున్న తల్లిదండ్రుల ఆలోచన ధోరణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement