మాచర్ల: మాచర్ల పట్టణంతోపాటు పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ సోమవారం కూడా అమలుచేశారు. ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో జిల్లా పోలీసుల ఉన్నతాధికారులు 144 సెక్షన్ అమలు చేస్తున్న విషయం విదితమే. పట్టణంలో టాస్క్‌ఫోర్స్, సివిల్ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎక్కడిక్కడ వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. నిబంధనలు పాటించని వాహనదారులపై జరిమానాలు విధిస్తున్నారు. అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం స్పందిస్తుంది. పట్టణంలో పలు ఇళ్లల్లో రెండు రోజులుగా తనిఖీలు నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లల్లో తనిఖీలు చేశారు. ప్రముఖ నాయకుల ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటుచేశారు. రింగ్‌రోడ్డు సెంటర్, పాలవాయి జంక్షన్, గుంటూరు రోడ్డు, నెహ్రూనగర్, అంబేడ్కర్ సెంటర్, బస్టాండ్ సెంటర్, తూర్పు బావి తదితర ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
భారీ సంఖ్యలో పోలీసుల పహారా పలు ఇళ్లల్లో సోదాలు
Comments
Please login to add a commentAdd a comment