సత్తెనపల్లి: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఉమెన్ ఐకాన్ లీడింగ్ స్వచ్ఛత –2023 అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ కొలిమి షమ్మి శుక్రవారం తెలిపారు. పారిశుద్ధ్యం, ఘన పదార్థాల నిర్వహణలో భాగంగా వ్యక్తిగత, స్వయం సహాయక, చిన్న తరహా, సామాజిక మరుగుదొడ్ల నిర్వహణ, సెప్టిక్ ట్యాంకుల శుభ్రత, వ్యర్థాల శుద్ధికరణ, చెత్త సేకరణ, చెత్తతో కళాకృతుల తయారీ, తడి చెత్త వినియోగం, వంటి అంశాలపై కృషి చేస్తున్న మహిళలు ఇందుకు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 27 లోగా సత్తెనపల్లి పురపాలక సంఘ పరిధిలోని వార్డు సచివాలయాలలో వార్డు శానిటేషన్ సెక్రటరీలకు దరఖాస్తులు అందజేయాలని కోరారు. అవార్డుకు ఎంపికై న మహిళలకు జూన్ 5వ తేదీన నిర్వహించనున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో పురస్కారాలు అందజేస్తారని తెలిపారు. ఇతర వివరాలకు శానిటరీ ఇన్‌స్పెక్టర్ విజయసారథి 9849907932లో సంప్రదించాలని కోరారు.